జగన్‌కు మూర్ఖత్వం, అహంకారం ఎక్కువ. ఆ మూర్ఖత్వంతోనే రాజధానిని విభజిస్తున్నారు. ఆ మూర్ఖత్వం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందే సీఎం అయ్యే గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నారు అంటూ మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం అనేది రాష్ట్రానికి మెదడు లాంటిదని, అసెంబ్లీని అమరావతిలో పెట్టి సచివాలయం విశాఖకు తరలిస్తామంటే.. మెదడు లేని తల ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.
రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలి. లేదంటే గ్రేటర్ రాయలసీమకు పిలుపునిస్తాం. ఈనెల 23న హైదరాబాద్‌లో రాయలసీమ నేతల సమావేశం నిర్వహిస్తున్నాం అని ఆయన వెల్లడించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి డబ్బు మీదే ఆశ. ఇక్కడి ఆడవారే నయం ముందుండి పోరాడుతున్నారు.’ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.