40.2 C
Hyderabad
April 29, 2024 17: 24 PM
Slider విజయనగరం

పోలీసులలో కదలిక తెప్పించిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన

#VijayanagaramSP

విజయనగరం జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం కలెక్టరేట్ జంక్షన్ వద్ద జరిగిన ఓ ప్రైవేటు ట్రాఫిక్ సిగ్నెల్ ను ఢీ కొట్టిన ఘటన పోలీసులలో కదలిక తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తో కూలంకుషంగా చర్చించారు.

ఆ సంఘటన జరిగిన తర్వాత  నగరంలో రద్దీ  ప్రదేశాలను గుర్తించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. తక్షణం రంగంలో కి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు రద్దీ అయిన ప్రాంతాలను గుర్తించారు.

ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్, గంటస్థంబం ,న్యూపూర్ణ ,నీళ్ల ట్యాంక్ పాత బస్టాండ్ తదితర ప్రాంతాలను గుర్తించారు. ముందస్తు చర్యగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పాదా చారులు రోడ్డు దాటే విధంగా జీబ్రా లైన్లు వేయనున్నారు. అలాగే వారికోసం డివైడర్లను కాస్త తొలగించారు.

అలాగే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ,జీబ్రా లైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పోరేషన్ కు లెటర్ రాసారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నగరంలో రద్దీ గా ఇరుకుగా ఉన్న ప్రాంతాలను సందర్శించారు.

అక్కడ పాదాచారులను ట్రాఫిక్ సమస్య గురించి వాళ్లు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య ల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో కలెక్టరేట్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలా జరగకూడదని పోలీసులు అందునా ట్రాఫిక్ పోలీసులు ,స్థానికులతో ఎస్పీ చర్చించడం హర్షదాయకమనే చెప్పాలి.

Related posts

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభ పరీక్ష

Satyam NEWS

అన్నవరం వన దుర్గమ్మ ఆలయం లో చండి హోమం

Satyam NEWS

7న ఆదివాసీల భారత్ బంద్

Bhavani

Leave a Comment