38.2 C
Hyderabad
April 28, 2024 20: 36 PM
Slider ఆధ్యాత్మికం

మల్దకల్ దేవాలయ అభివృద్ధికి సహకరించండి

#Maldakal Temple

ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహల్లాద రావు, కార్యనిర్వాణాధికారి సత్య చంద్రారెడ్డి కోరారు. శనివారం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం అపర తిరుపతిగా చేయాలని దైవ సంకల్పమని అన్నారు.

దేవాలయానికి సప్త ద్వారాలు ఏర్పాటు చేయాలని సంకల్పించుకోగా మొదటి ద్వారం బాణాల శేషుఫణి, రెండవ ద్వారం తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లుతెలిపారు. మూడవ ద్వారానికి ఇంకా ఎవరు దాతలు రాలేదని, నాలుగవ ద్వారం శ్యాంసుందర్, శివ శివాని స్కూల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు.

అలాగే దేవాలయంలో ఉత్తర ద్వారం పెద్దొడ్డి రామకృష్ణ చేయిస్తున్నాడని, ఇంకా దక్షిణ ద్వారం, విష్ణువు, లక్ష్మీదేవి ద్వారాలను దాతలు ముందుకు వచ్చి చేయించాలని తెలిపారు. టేకు కలపతో రమణీయంగా విగ్రహాల రూపులను తయారు చేయించి బ్రహ్మోత్సవాల లోపు సప్త ద్వారాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు

. అలాగే విష్ణు వైకుంఠ, లక్ష్మీదేవి ద్వారాలకు వెండి కవచాన్ని తొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవాలయం మొత్తం సీసీ వేయించి గ్రానైట్ వేయించడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు. ప్రస్తుతం ఒకటవ ద్వారం నుండి 4వ ద్వారం వరకు ర్యాలంపాడు భక్తుడు నరసింహులు గౌడ్ సిసి, గ్రానైట్ వేయించి క్యూ లైన్ కొరకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధిలో అనేకమంది సహకరిస్తున్ననందున ధన్యవాదాలు తెలిపారు.

ఈవో సత్య చంద్రారెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో భాగంగా దాతలు విశేషంగా స్పందించి సహకరిస్తున్నారని తెలిపారు. రేకుల షెడ్లు, ముందు భాగము దేవాలయంలోపల్లి భాగం వేయించారని, రథాన్ని దామ శంకరయ్య చేయించారని తెలిపారు. కోనేరు పరిశుభ్రం చేశామని అట్టి పవిత్ర జలాలతో ఉదయం బిందేసేవా ద్వార శ్రీ స్వామి వారి కి అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే సప్త ద్వారాల ఏర్పాటుకు గాను దాతలు ముందుకు వస్తే ఇంకా మిగిలిన ద్వారాలు పనులను బ్రహ్మోత్సవాల లోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవి, రామచంద్రారెడ్డి, వీరారెడ్డి, నరసింహులు గౌడ్ భక్తులు పాల్గొన్నారు.

Related posts

కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు

Satyam NEWS

తెలంగాణ ఉద్యమకారుడికి ఘన నివాళి

Bhavani

256 మంది టిడ్కో బాధితుల మొర ఆలకించండి..!

Bhavani

Leave a Comment