Slider నిజామాబాద్

లాక్ డౌన్ బాధితులకు సహాయం చేసిన పూర్వ విద్యార్ధులు

#Old Students Association

కరోనా లాక్ డౌన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్నవారికి, నిరుపేదలకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన గవర్నమెంట్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఆహారం అందచేశారు. మొత్తం 200 మంది పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అమ్మ అనాధ ఆశ్రమంలో గల పేద పిల్లలు, పేద ప్రజలు ఈ సహాయాన్ని అందుకున్నారు.

ఆహార పొట్లాలు, అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ ను పూర్వ విద్యార్ధులు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కోటగిరి అయ్యప్ప కుటీరం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పందిముక్కుల సునీల్, పందిముక్కుల ప్రవీణ్ , పటేల్ శివ చరణ్ , వేములపల్లి రాజ్ కుమార్, కర్నె భూపేందర్, పందిముక్కుల సందీప్, పందిముక్కుల సాయిబాబు, వేములపల్లి ఆనంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని PSR యువసేన సౌజన్యం తో నిర్వహించారు.

Related posts

జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే

Satyam NEWS

ప్రభుత్వ ఆస్తులను మనమే కాపాడుకోవటానికి సమరమే శరణ్యం

Satyam NEWS

ప్రశాంతంగా పైడితల్లి అమ్మ‌వారి ఉత్సవాలు నిర్వహించాలి…!

Satyam NEWS

Leave a Comment