28.7 C
Hyderabad
April 28, 2024 04: 00 AM
Slider ప్రత్యేకం

కుర్చీ రాజకీయాలు తప్ప కాంట్రాక్ట్ కార్మికుల్ని పట్టించుకోరా?

#bogataashok

రాష్ట్రంలో అధికారం కోసం కుర్చీ రాజకీయాలు తప్ప ప్రభుత్వ ఆసుపత్రిల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్ట్ వర్కర్ల ఆకలి ఆక్రందనలు పట్టించుకోరా ముఖ్యమంత్రి గారూ అని ఏఐటీయూసీ విజయనగరం  జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో భారీ ధర్నా చేసి నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ గార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత బుగత అశోక్ మీడియా తో మాట్లాడుతూ హాస్పిటల్స్ లో ఉన్న పేషేంట్లకి ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు లెక్కచేయకుండా ఆసుపత్రులను శుభ్రం చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, దగ్గరుండి ప్రతి పనిని పరిశీలిస్తున్న సూపర్వైజర్లు, ఆసుపత్రి కంటికి రెప్పలా కాపాడుతున్న సెక్యూరిటీ గార్డులకి టి.వి.టి గ్రూప్, స్కాట్ లేండ్ గ్రూప్ కాంట్రాక్టర్లు ఇద్దరూ ఎవరి దన్నో చూసుకుని 3 నెలలగా జీతాలు చెల్లించకుండ పస్తులు పెట్టీ వెట్టి చెక్కిరి చేయించుకుంటారా అని మండిపడ్డారు. ప్రభుత్వం వర్కర్ల జీవితాలను దళారీ వ్యవస్థ చేతుల్లో పెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీతాలు ఇవ్వనప్పుడల్లా రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే జీతాలు వేస్తారు లేకుంటే వారిని పండుగల్లో కూడా పస్థులు ఉంచుతారా అని ప్రశ్నించారు. జిల్లా ప్రభుత్వ సర్వజన, పి.హెచ్.సి, సి.హెచ్.సి, ఏరియా ఆసుపత్రలల్లో పనిచేశ్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, పెస్ట్ కంట్రోల్ వర్కర్లకు, సూపర్వైజర్లుకి ప్రభుత్వం జారీ చేసిన 549 జీవో ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్స్ కి 16వేలు, సెక్యూరిటీ గార్డులకి జి.ఓ నెం. 43 ప్రకారం జోన్ 1 వారికి 11,912 /-, జోన్ 2 వారికి 11162 /-, జోన్ 3 10,912 /- జీతాలు ప్రకటించిన ప్రభుత్వం వర్కర్స్ జీతభత్యాల విషయం తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు చెందిన టి.వి.టి గ్రూప్స్ అనే కాంట్రాక్టురుకి, భీమవరంలో ఉన్న స్కాట్ ల్యాండ్ గ్రూప్ కాంట్రాక్టరుకి అప్పగించడం అంటే దళారీ వ్యవస్థను ఎంతలా పోషిస్తున్నారో తేటతెల్లమవుతుందని అన్నారు.

ఇలా దళారీ చేతుల్లో పెట్టడం వలన పెరిగిన వేతనాలు ఇవ్వకుండా, ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించకుండా వర్కర్స్ బ్రతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. శ్రమకి తగిన జీతం లేక, ప్రతి నెల జీతాలు అందకపోవడం వలన ప్రభుత్వాలు పెంచుతున్న ధరల భారాలను తట్టుకోలేక అప్పులపాలు అయ్యి వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టరు మారిన తర్వాత 20 మాసాలు నుంచి పి ఎఫ్ ఎంత జమ అవుతుందో, ఈఎస్ఐ ఎంత కటింగ్ చేస్తున్నారో ఇంతవరకు ఫే స్లిప్పులు ధ్వారా తెలియజేయకుండా నాటకాలాడుతూ తక్కువ వేతనాలు చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు.

పెద్దాసుపత్రి నేడు మెడికల్ కాలేజి అయినందున వార్డులు పెరిగిడం వలన ఆసుపత్రిలో సరిపడా వర్కర్స్ నియమించకుండా తక్కువమంది వర్కర్స్ తో వెట్టిచాకిరీ చేయించుకుని ప్రభుత్వం జారీ చేసిన జీవో 549 ప్రకారం జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టరు కార్మికులందర్నీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సీజన్లో కూడా ఇల్లు, పిల్లల్ని వదిలి ప్రాణాలు పణంగా పెట్టి, కరోనా రోగులకు సేవ చేసి వర్కర్స్ అందరూ కరోనా బారిన పడిన వారిని కనీసం ఎవ్వరూ పట్టించుకోకపోగా ప్రభుత్వం మాత్రం వీరి పట్ల నిర్లక్ష్యం చూపుతుందన్నారు.

ప్రభుత్వ పెద్దలు వెంటనే కలుగజేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరిని అప్కాశ్ లో చేర్చి ప్రతి నెలా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్కర్స్ తో కాయాకల్పలాంటి పనులు చేయించుకుని అవార్డులు అధికారులకి, కష్టించి పని చేస్తున్న వర్కర్స్ కి వేధింపులు, ఆకలి మిగులుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించి, ప్రభుత్వం ఇచ్చిన జీవో ల ప్రకారం కాంట్రాక్టర్లు చేత జీతాలు ఇప్పించి వర్కర్స్ సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేయలేని పక్షంలో రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరంగా చేస్తామని హెచ్చరించారు. తరువాత జరగబోయే పరిస్థితులకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని బుగత అశోక్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్. రంగరాజు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బాలి గౌరినాయుడు, నెల్లిమర్ల సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి తాలాడ సన్నిబాబు, ఎఐటియుసి నాయకులు ఎ. రాములు, ఎ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు,  పి.ఆర్.ఓ కాళ్ళ పాపారావు, మరియు మహారాజా, ఘోషా, నెల్లిమర్ల, గజపతినగరం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు ఆసుపత్రిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సురవైజర్లు పాల్గొన్నారు.

Related posts

సీక్రెట్ జీవోలు ఎందుకు? విసుక్కుంటున్న అధికారులు

Bhavani

సోము వీర్రాజు అభిమాని ఆత్మహత్యాయత్నంతో అలజడి

Satyam NEWS

10 శాతం ఓట్లు పోయినా…. బిజెపికి ఢోకా లేదు….

Satyam NEWS

Leave a Comment