39.2 C
Hyderabad
April 28, 2024 13: 43 PM
Slider హైదరాబాద్

నివాస గృహాల మధ్య కరోనా టెస్టింగ్ సెంటర్ పెడితే ఎలా?

#Covid Testing Center

అనుమతులు లేకుండా నివాస గృహాల మధ్య వెలసిన కరోనా పరీక్షా కేంద్రాన్ని తరలించాలని హైదరాబాద్ లోని అంబర్ పేట్ వాసులు ఆందోళన నిర్వహించారు. అంబర్ పేట్ 6వ నంబర్ ప్రధాన రహదారిపై పాత్ లాబ్ covid 19 టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు.

టెస్ట్ సెంటర్ కి ఆనుకొనే అపార్ట్మెంట్ ఉందని అందులో 100 మందికి పైగా నివాసం ఉంటామని అపార్ట్మెంట్ వాసుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా టెస్ట్ సెంటర్ నిర్వహించడం అన్యాయమని వారు అంటున్నారు.

కరోనా పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రానికి అపార్ట్మెంట్ కు మద్యలో 10 ఫీట్ల దూరం మాత్రమే ఉందని, కరోనా పరీక్షలకు వచ్చిన రోగులు తమ అపార్ట్మెంట్ గేటు ముందు నిలబడి ఉమ్మివేయడం, తుమ్మడం, దగ్గడం, వాంతులు చేసుకోవడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.

పరీక్షల నిర్వహణ తర్వాత సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం కూడా మరో ముఖ్యమైన అంశం. ఈ పరీక్షా కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

Satyam NEWS

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపికి ఎదురుదెబ్బ

Satyam NEWS

ఎగ్జిట్ ట్రెండ్: దేశభక్తిని ఊడ్చేసిన చీపురు పార్టీ

Satyam NEWS

Leave a Comment