28.7 C
Hyderabad
April 28, 2024 09: 06 AM
Slider నిజామాబాద్

శెట్టూలురు కథగా౦లో కరోనా నిర్ధారణ పరీక్షలు

#CoronaTests

కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండల౦ లోని ఖద్గావ్, షెట్లుర్  గ్రామాలలో, కోవిడ్ వ్యాధి నిర్దారణ క్యాంప్ శనివారం   ఏర్పాటు చేశారు.

కోవిడ్ లక్షణాలైన జ్వరం జలుబు దగ్గు శ్వాస తీసుకోవడములో ఇబ్బంది రుచి, వాసన తెలియకపోవడం,గొంతు నొప్పి, మొదలగు లక్షణాలు ఉన్నవారు,  ఎలాంటి లక్షణాలు లేకున్నా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేపించుకోవలని ప్రజలకు తెలియజేయాగా 30 మందికి వైద్య సిబ్బంది చేయించుకున్నారు.

వ్యాధి నిర్దారణ పరీక్షలలో అందరికి నెగెటివ్ వచ్చింది. కోవిడ్ 19 నుంచి మనల్ని మన కుటుంబాన్ని ఎలా  కాపాడుకోవాలని అలాగే వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు పాటించాలని విషయాల పై డివిజనల్ ఆరోగ్యబోధకుడు దస్థిరాం అవగాహన కల్పించారు.

అనవసరంగా రోడ్ మీదికిరాకూడదు.

పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా బయటకు రాకుండా  చూసుకోవాలి. పని నిమిత్తం ఒకరు బయటకు వెళితే  తప్పకుండా మాస్క్ లేదా రుమాలు ధరించాలి,

బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ కూడదు, మనుషుల మధ్య  భౌతిక దూరం పాటించాలి,

ఒకరు ధరించిన మాస్క్ ను మరొకరు దరించారాదు,

తరచు చేతులను సబ్బుతో కడుకొవాలి లాంటి 

పలు విషయాలను ప్రజలకు అవగాహన వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ ఆరోగ్య బోధకుడు దస్థిరాం, లక్ష్మీ, మనెవ్వ, ఆరోగ్య కార్యకర్తలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

Murali Krishna

నిర్భయ దోషుల ఉరి శిక్షకు మళ్లీ డెత్ వారంట్

Satyam NEWS

సీఎంఎస్-1 నింగిలోకి కౌంట్ డౌన్ ప్రారంభం

Sub Editor

Leave a Comment