40.2 C
Hyderabad
April 29, 2024 17: 31 PM
Slider వరంగల్

వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు

#MuluguDistrict

దేశ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న క్రమంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి శనివారం నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగంగా  ఏఎస్పీ  సాయి చైతన్య ములుగు ఏరియా హాస్పిటల్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.

ఈ సందర్భంగా  ఆయన   మాట్లాడుతూ భారత్ లో తయారు అయ్యే వ్యాక్సిన్  మీద నమ్మకం ఉందని, వాక్సిన్ విషయం లో ఎటు వంటి అపోహ పెట్టుకోవద్దు అని చెప్పారు .

వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరూ భయపడవద్దని  ఏ ఎస్ పి శ్రీ   అన్నారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు  పరిశీలించేందుకు ప్రత్యేకంగా వైద్య అధికారులను నియమించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో DM&HO  A. అప్పయ్య, ఎస్ బి ఇన్స్పెక్టర్ రెహమాన్ ,అడ్మిన్ ఎన్.ఆర్.ఐ సురేంద్ర, డిసిఆర్బి ఎస్ ఐ చైతన్య చందర్, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

శ్రీ రామాంజనేయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు

Satyam NEWS

ఫుడ్ పాయిజనింగ్ తో ఛోటా రాజన్ హత్యకు కుట్ర

Satyam NEWS

రైతు ఉత్ప‌త్తి దారుల సంస్థ‌ల ద్వారా మామిడి కాయ‌ల కొనుగోలు

Satyam NEWS

Leave a Comment