28.7 C
Hyderabad
April 27, 2024 03: 49 AM
Slider హైదరాబాద్

ప్రోటో కాల్ ఉల్లంఘన: అధికారులపై కార్పొరేటర్ దూసరి లావణ్య ఫైర్

#lavanya

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్లు అంబర్ పేట గోల్నాక డివిజన్  ఏ కె ఫంక్షన్ హాల్ లో  రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్  ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు లేదని  రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. తన డివిజన్ లో కార్యక్రమాలు చేస్తున్న ఫ్లెక్సీ పై  తన ఫోటో లేదని కావాలని తమను అవమానిస్తున్నారని  అధికారులు కూడా ఎమ్మెల్యే మాట వింటూ ప్రోటో కాల్ పాటించడం లేదని ఆమె మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో  పాల్గొనకుండానే ఆమె తిరిగి వెళ్ళిపోయారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీద ప్రజలకు అండగా నిలుస్తూ కార్యక్రమాలు చేస్తుంటే అంబర్పేట నియోజకవర్గం లో మాత్రం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తనను కావాలని అవమానపరిస్తున్నారని అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అధికారులు కూడా తన డివిజన్ లో కార్యక్రమాలు చేస్తూ ప్రోటో కాల్ పాటించడం లేదని ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.

మేము కూడా ప్రజలు గెలిపిస్తేనే  ప్రజా ప్రతినిధుల మయ్యామని  ఇది గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు. దళిత బంధు విషయంలో కూడా  కార్పొరేటర్ కు కార్యకర్తలు కలిస్తే దళిత బంధు రాదని  భయాందోళనకు గురి చేస్తున్నారని ఇప్పటికైనా మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్టు కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

రేవంత్ రెడ్డి తరపున షబ్బీర్ అలీ నామినేషన్

Satyam NEWS

శ్రమశక్తే నిజమైన ధీశక్తి

Satyam NEWS

మూగబోయిన పాటకు…

Satyam NEWS

Leave a Comment