38.2 C
Hyderabad
April 27, 2024 16: 03 PM
Slider ప్రత్యేకం

రాజంపేట టీడీపీ లో పెరుగుతున్న ఆశావహులు

#tdp

అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రాజంపేట జిల్లా కేంద్రం దక్కక పోవడంతో పాటూ మెడికల్ కాలేజీ కూడా తరలి పోయింది.దీనితో నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, ఒంటిమిట్ట,నందలూరు,సిద్దవటం,సుండుపల్లె,వీరపల్లె ప్రజల్లో అధికార పార్టీపై,నేతలపై తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఈ నేపద్యంలో అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంలోకి వలసలు మొదలై నాయి.ఈ నేపధ్యంలో టీడీపీ పార్టీలో కొత్త జోష్ నెలకొంది.గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందిన భత్యాల చెంగల్ రాయుడు నియోజక వర్గ ఇంచార్జీ గా అధిష్టానం నియమించింది.అంతే కాకుండా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయనే పార్టీకి సర్వం అయ్యి పార్టీని నడిపిస్తున్నారు.

పార్టీలో వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేస్తున్న భత్యాల కు పార్టీలో అనుకోని గ్రూపులు తయారైనాయి.ఇందులో రాజు విద్యాసంస్థల అధినేత వీర పల్లె మండలానికి చెందిన చమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు.ఈ మేరకు రాజంపేట లో గతంలో భత్యాల పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయగా,ఈయన కూడా స్వంతంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు.

పార్టీ కార్యక్రమాలు చేపడుతూ అన్నీ మండలాలను చుట్ట బెడుతున్నారు.భత్యాల కు జగన్మోహన్ రాజుకు సఖ్యత లేకపోవడంతో ఇద్దరి వర్గీయుల మధ్య తరచూ గొడవలు కూడా జరుగు తున్నాయి.ఇదిలా ఉండగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు సుండుపల్లె వైసీపీ ఇంచార్జీ మేడా విజయ శేఖర్ రెడ్డి కూడా టీడీపీ నుంచి రాజంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు.

టీడీపీ లో చేరడానికి రంగం సిద్ధం చేశారు.పార్టీలో ఇంకా చేర కుండానే చంద్రబాబు నాయుడు ను కలిసి ఫొటో దిగి మీడియాకు తాను పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ముచ్చటగా రాజంపేట లో మూడో టీడీపీ కార్యాలయం ప్రారంభించేశారు.ఇలాంటి పోటా పోటీ వాతావరణం వలన రాజంపేట టీడీపీ రాజకీయాలు కార్యకర్తల మధ్య గందరగోళం మొదలయ్యింది.

అధిష్టానం జాప్యం చేయకుండా పార్టీలో గందరగోళం ను సరిదిద్ది అభ్యర్థిని ఖరారు చేసి,వర్గాలను ఐక్యం చేస్తే బలమైన టీడీపీ ఓటు బ్యాంకు,ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు టీడీపీ గెలుపుకి సునాయాసం అనే ప్రచారం బలంగా ఉంది. రాజంపేట అసెంబ్లీ కి టీడీపీ నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతూన్న నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది

Related posts

లైట్ స్వీప్ బట్ ఓకే: సీట్లు తగ్గిన ఢిల్లీ అధికారం ఆప్ దే

Satyam NEWS

నేషనల్ ఇన్స్పైర్ పోటీలకు ములుగు నుంచి ఒక ప్రాజెక్టు ఎంపిక

Satyam NEWS

లాఠీచార్జికి నిరసనగా కూకట్ పల్లి బిజెవైఎం నిరసన

Satyam NEWS

Leave a Comment