28.7 C
Hyderabad
April 28, 2024 10: 55 AM
Slider మహబూబ్ నగర్

కుంభకోణం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలి

#cpi

దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ బ్యాంకులను, ప్రజలను, తీవ్రంగా మోసం చేసిన ఆదాని కంపెనీల కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ డిమాండ్ చేశారు.

సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆదాని కుంభకోణం పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ లోనీ ఎస్బిఐ బ్యాంకు ముందు సిపిఐ జిల్లా సమితి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 2014 నాటికి 5వేల కోట్ల వ్యాపారంతో ప్రపంచ ధనవంతుల్లో 609వ, స్థానంలోఉన్నటువంటి ఆదానీ 2022 సంవత్సరం నాటికి ప్రపంచ ధనవంతుల్లో రెండు, మూడవ స్థానాలకు చేరుకున్నాడు 8 మిలియన్ డాలర్ల నుంచి 140 మిలియన్ డాలర్లకు తన సంపదను ఏ విధంగా పెంచుకున్నడో దేశ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉందన్నారు.ఆదానీ మిత్రులు గనకనే దేశంలో లక్షలాదిమంది షేర్ హోల్డర్లకు ప్రభుత్వ రంగ సంస్థలకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగినా మాటల మాంత్రికుడైన  నరేంద్ర మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

తన మిత్రుని కుంభకోణం చూసి నోరు మూగ పోయిందా అని విమర్శించారు.పార్లమెంటరీ కమిటీతో విచారణ జయించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభ్యంతరం ఎందుకని,ఆదాని కంపెనీలలో తప్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చిన తర్వాతే  విచారణ జరిపిస్తే అక్రమాలు బయటకు తెలుస్తాయని తన మిత్రుడు జైలు పాలు కావాల్సి వస్తుందని, అందులో తన పాత్ర కూడా బయట పడుతుందని, విచారణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ నిరంతరం నరేంద్ర మోడీ నీతిమంతుడు నిజాయితీ వంతుడు అని గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని, నరేంద్ర మోడీ కన్నా ముందు పని చేసినటువంటి ప్రధాన మంత్రులపై ఎవరిపైన ఇలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. వారి మంత్రివర్గ సహచరులో, బంధువు లో, స్నేహితులపైనఅవినీతి ఆరోపణలు వచ్చినా, 70 కోట్ల విలువచేసే బోఫోర్స్ ఆయుధాల  కొనుగోలులో అక్రమాలు జరిగాయి అంటే ఆనాడు పార్లమెంటులో నరేంద్ర మోడీకి ఇప్పుడు ఉన్నటువంటి బలానికి అన్న ఎక్కువ బలం ఉన్నటువంటి రాజీవ్ గాంధీని  విచారణకు ఆదేశించారు.

2014 పూర్వం రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ టు జి స్పెట్రం వేలంలో అవినీతి జరిగిందని లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణ వస్తే విచారణకు ఆదేశించి నప్పుడు75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరిగిన అన్ని కుంభకోణాలను కలిపితే  ఆదాని కుంభకోణం చాలా రేట్లు పెద్దదన్నారు. ఇంత పెద్ద కుంభకోణం పైన కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ నుండి కనీస ప్రకటన చేయకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఏమి మాట్లాడకుండాఉండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ఎల్ఐసి ఆదాని కంపెనీలలో 80,000 కోట్ల రూపాయలు పెట్టబడులనుపెట్టడానికి ఎవరి ప్రోత్సాహం, అధికార బలం ఉందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చినటువంటి అప్పులు ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దేశ ప్రజల పైన ప్రేమ ,దేశ సంపాదన రక్షించాలని ఆకాంక్ష నిజంగా బిజెపి నాయకులకు ఉంటే ఆదాని కంపెనీల వ్యవహారాల పైన సమగ్రమైన విచారణ జరిపిం చుటకు జాయింటు పార్లమెంటు కమిటీని ,సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపడానికి నిర్ణయం తీసుకోవాలని ,ఆదాని కంపెనీ ఆస్తులు జప్తు చేసిప్రభుత్వ రంగ సంస్థల పెట్టబడులకు జమ చేయాలని బాల నరసింహ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనంద్ జీ,వి .వెంకటయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ జిల్లా సమితి సభ్యులు మర్యాద వెంకటయ్య బొల్లెద్దుల శ్రీనివాసులు ఏఐటియుసిజిల్లా కార్యదర్శి ఏం శివ శంకర్ డిహెపిస్ జిల్లా కార్యదర్శి బండి లక్ష్మీపతి పట్టణ సహాయ కార్యదర్శి కొత్త రామస్వామి ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కేశముల సురేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుడిపల్లి నిరంజన్,మదిలేటి ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తూము కుంట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Related posts

వనపర్తి జిల్లా పోలీసు ప్రజావాణిలో 6 ఫిర్యాదులు

Bhavani

BTC Bitcoin rates, news, and tools

Bhavani

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment