33.7 C
Hyderabad
April 29, 2024 02: 26 AM
Slider మహబూబ్ నగర్

పెన్షన్ ర్యాలీ: కదం తొక్కిన సీపీయస్ ఉద్యోగులు

#CPC employees

సీపీయస్ రద్దు ఏకైక అంశంగా నేడు జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో సీపీయస్ ఉద్యోగ,ఉపాధ్యాయుల పెన్షన్ ర్యాలీ కలెక్టరేట్ నుండి ఫ్లయ్ ఓవర్ మీదుగా వై.యస్.ఆర్ చౌక్ వరకు సీపీయస్ రద్దు చేయాలనే నినాదాలతో భారీ ర్యాలీ తీశారు.ఈ ర్యాలీ కు ముఖ్య అతిథిగా సీపీయస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్లు పాల్గొన్నారు.

అనంతరం వై.యస్.ఆర్ సర్కిల్ లో సభ జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, పుల్వామా ఘటనలో చనిపోయిన 43 సీ.ఆర్.పి.ఆఫ్ జవాన్లలో 22 గురు సీపీయస్ ఉద్యోగులైనందున నేటికి వారికి ఫ్యామిలీ పెన్షన్ లేదన్నారు.

ఈ విధానం వల్ల కార్పొరేట్లకు లాభం తప్పితే ఉద్యోగులకు సామాజిక భద్రత లేదన్నారు.PFRDA చట్టం, రాజకీయ నాయకులకు కార్పొరేట్లకు లోపాయకరిగా పుట్టిన చట్టం అని, రాష్ట్ర ప్రభుత్వాల ను తప్పుతోవ పట్టించి, NSDL స్వయం ప్రతిపాదిత సంస్థ అగ్రిమెంట్ లు చేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానంపై సమీక్ష జరిపి,ఉద్యోగుల సంక్షేమం కల్పించాలన్నారు.సిపిఎస్ రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.

సిపియస్ విధానం వలన రాష్ట్రవ్యాప్తంగా లక్ష 50 వేల మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కలిగే నష్టాల గురించి , ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అనీ వివరించడం జరిగింది.సిపిఎస్ విధానంను ఇప్పటికీప్పుడు రద్దు చేస్తే 8 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతాయని తద్వారా ప్రజా సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఎస్ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే నాగరాజు, ఉపాధ్యక్షులు సూర్య ప్రకాశ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కోశాధికారి వన్నవాడ రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు బుచ్చన్న, రాష్ట్ర సహాధ్యక్షులు విష్ణు, రాష్ట్ర సభ్యులు  నాగవల్లి ఉపేందర్,  మల్లికార్జున్, రోషన్,కామర్తి రాజశేఖర్, మ్యాన్ పవన్, రామ్ చందర్, జిల్లా సహాధ్యక్షులు నగేష్, ప్రతాపరెడ్డి,సాతర్ల రఘు, పాల్వాయి లక్ష్మీనారాయణ,

జిల్లా కార్యదర్శి: భాస్కర్,  కొండాపురం ప్రతాప్, జిల్లా టెక్నికల్ మెంటర్ రాకేష్, దామా రాఘవేంద్ర,రాష్ట్ర టెక్నికల్ అధ్యక్షులు వెంకటరాజరెడ్డి గారు, TNGO కార్యదర్శి  బీజాపూర్ ఆనంద్ ,భీమన్న గారు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి మద్దిలేటి ,రవివర్మ, లోక్రాజ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు  పరమేశ్వర్రెడ్డి, పులిపాటి లక్ష్మన్న, యుటిఎఫ్ గోపాల్,  తిమ్మప్ప ,సోమ సుందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ నారాయణ, , వీఆర్వో సంఘం అధ్యక్షులు ఆంజనేయులు జిల్లా ‌మహీళా కార్యదర్శి : వెంకటలక్ష్మీ, దానమ్మ, ప్రణీత,  జిల్లా ఇ.సి మెంబర్:  రఫీ, జయన్న, జానకిరాముడు  వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం

Satyam NEWS

పెండింగ్ బిల్లులపై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

Satyam NEWS

ప్రభుత్వ వైఫల్యాలపై నిత్య పోరాటాలు

Satyam NEWS

Leave a Comment