38.2 C
Hyderabad
April 28, 2024 22: 05 PM
Slider వరంగల్

క్రీడలు దేహా దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

#cricket

క్రీడలు దేహ దారుఢ్యానికీ కి మానసిక ఉల్లాసం స్నేహభావానికి తోడ్పడతాయని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అన్నారు. వల్లాల కిష్టయ్య  స్మారకార్థం ములుగు మండలంలోని జాకారం గ్రామంలో గత 15 రోజులుగా ఉమ్మడి  వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ మ్యాచ్ లు 45 వరకూ విరామం లేకుండా ఆడారు. ఈ స్మారక టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్, రన్నర్లకు గురువారం బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్, ఎస్సై లక్ష్మారెడ్డి, రత్న హోటల్ యజమాని ముప్పిడి శ్యామ్ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా యూత్ నాయకులు, ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య, బిఆర్ఎస్ మండలాధ్యక్షులు బాదం ప్రవీణ్  ఫైనల్ మ్యాచ్ లో మొదటి స్థానం నిలిచిన ములుగు అఫ్రోజ్11 టీంకు మెమొంటో తో పాటు 20వేల నవదు బహుమతిని బాదం ప్రవీణ్ అదనపు కలెక్టర్ లతో కలిసి అందించారు.

రెండవ స్థానంలో నిలిచిన ములుగు ఆదర్శ యూత్ కు మెమంటో తో పాటు పదివేల నగదును రత్న హోటల్ యజమాని ముప్పిడి శ్యామ్ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి చేతుల మీదుగా అందించారు.మాన్ అఫ్ ద టోర్నీ సురేష్, మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లను కార్తీకులకు సీనియర్ జర్నలిస్ట్ పిట్టల మధుసూదన్,బి, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండ్రత్ దామోదర్, ఎండి లాల్ పా, ఉప సర్పంచ్ ఈర్ల ప్రశాంత్, వార్డు సభ్యులు రాణా ప్రతాప్ లు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి

Bhavani

New Rules: మారుతున్న నిబంధనల ప్రభావం ఏమిటి?

Satyam NEWS

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment