29.7 C
Hyderabad
April 29, 2024 09: 08 AM
Slider నిజామాబాద్

గుడ్ న్యూస్: సీఆర్పీఎఫ్ జవాన్ కు కరోనా నెగెటివ్

kamareddy board

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తాండకు చెందిన గంగావత్ నరేష్ సీఆర్పీఎఫ్ జవాన్ కు కరోన నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నరేష్ సీఆర్పీఎఫ్ లో జవాన్ గా పని చేస్తున్నాడు.

నరేష్ పెద్దనాన్న చనిపోవడంతో సెలవు తీసుకుని ఇండియాకు 13 వ తేదీన సూపర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో రామగుండం వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్ వరకు, కరీంనగర్ నుంచి మాచారెడ్డి వరకు బస్సులో వచ్చాడు. మాచారెడ్డి నుంచి నరేష్ తమ్ముడి బైకుపై తండాకు చేరుకున్నాడు.

ఈ క్రమంలో సూపర్ సంపర్క్ క్రాంతి రైలులో ఇండోనేషియకు చెందిన 8 మంది నరేష్ తో పాటు వచ్చారు. ఆ 8 మందికి కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ రావడంతో నరేష్ కు కమరెడ్ఫ్య జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోన లక్షణాలుగా గుర్తించి హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు.

నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ కు వెళ్లిన నరేష్ శాంపిల్స్ ను పూణే కు పరీక్షల నిమిత్తం పంపించగా అతనికి కరోన నెగెటివ్ వచ్చింది. నరేష్ వార్త జిల్లాలో కలకలం రేపింది. తండాలో ప్రజలు నేడు రిపోర్ట్ వచ్చేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

నెగెటివ్ రిపోర్ట్ వార్త తెలియగానే తండా ప్రజలతో పాటు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే లింగంపేట్ మండలం కొండాపూర్ గ్రామనికి చెందిన గంగావత్ గంగూలీ ఈజిప్ట్ నుంచి వచ్చాడు. అతనికి కరోన లక్షణాలు ఉండటంతో బాన్సువాడ వైద్యులు అతడిని నిన్న హైదరాబాద్ పరీక్షల నిమిత్తం తరలించారు.

గంగూలీకి సైతం నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కరోన రాకుండా అష్టదిగ్బంధనం చేపట్టాలని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మరో వైపు మార్చి 1 నుంచి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Related posts

పల్లె ప్రగతి పనులపై శ్రద్ధ చూపండి

Satyam NEWS

రాష్ట్ర మంతటా వేదవ్యాసుని జయంతి వేడుకలు..!

Satyam NEWS

ఐపిఎస్ అధికారి ఫామ్ హౌస్ లో మృతదేహం

Bhavani

Leave a Comment