39.2 C
Hyderabad
April 28, 2024 11: 32 AM
Slider ముఖ్యంశాలు

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ నుంచి కేరళకు వెళ్లి వచ్చే శబరిమల భక్తుల కోసం రానుపోను కలిపి 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

సికింద్రాబాద్‌-కొల్లం (నం 07117): నవంబరు 20, డిసెంబరు 4, 18, జనవరి 8 తేదీల్లో నాలుగు సర్వీసులు. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. కాచిగూడ, మహబూబ్‌నగర్‌, గద్వాల మార్గంలో ఈ రైలు వెళ్తుంది.

కొల్లం-సికింద్రాబాద్‌ (నం 07118): నవంబరు 22, డిసెంబరు 6, 20 జనవరి 10 తేదీల్లో నాలుగు సర్వీసులు. మంగళవారం మధ్యాహ్నం 2.30కి కొల్లంలో బయల్దేరే రైలు బుధవారం 9.05కి సికింద్రాబాద్‌ చేరుతుంది.

సికింద్రాబాద్‌-కొల్లం (నం07121): నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15 తేదీల్లో అయిదు సర్వీసులు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో బయల్దేరే రైలు సోమవారం రాత్రి కొల్లం చేరుతుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది.

కొల్లం-సికింద్రాబాద్‌ (నం07122): నవంబరు 29, డిసెంబరు 13, 27, జనవరి 3, 17 తేదీల్లో 5 సర్వీసులు. మంగళవారం తెల్లవారుజామున 2.30కి బయల్దేరే రైలు బుధవారం ఉదయం 10 గంటలకు చేరుతుంది.

సికింద్రాబాద్‌-కొల్లం (నం07123): నవంబరు 21, 28 తేదీల్లో రెండు సర్వీసులు. సోమవారం మధ్యాహ్నం 2.30కి బయల్దేరే రైలు మంగళవారం రాత్రి 11.50కి గమ్యం చేరుతుంది. చర్లపల్లి, భువనగిరి, కాజీపేట, వరంగల్‌ మార్గంలో ప్రయాణిస్తుంది.

కొల్లం-సికింద్రాబాద్‌ (నం07124): నవంబరు 23, 30 తేదీల్లో రెండు సర్వీసులు. బుధవారం తెల్లవారుజామున 2.30కి బయల్దేరే రైలు గురువారం ఉదయం 11 గంటలకు గమ్యం చేరుతుంది.

సికింద్రాబాద్‌-కొట్టాయం (నం07125): నవంబరు 20, 27 తేదీల్లో రెండు సర్వీసులు. ఆదివారం సాయంత్రం 6.50కి బయల్దేరే రైలు సోమవారం రాత్రి 9 గంటలకు గమ్యం చేరుతుంది. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మార్గంలో వెళ్తుంది.

కొట్టాయం-సికింద్రాబాద్‌ (నం07126): నవంబరు 21, 28 తేదీల్లో రెండు సర్వీసులు. సోమవారం రాత్రి 11.20 గంటలకు బయల్దేరే రైలు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గమ్యం చేరుతుంది.

Related posts

అందరికీ మేలుకలిగేలా నదుల అనుసంధానం

Satyam NEWS

పువ్వాడ ని పరామర్శించిన కేటిఅర్

Bhavani

వినాయక మండపాలపై దాడులు చేసేవారిని శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment