గత టిడిపి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసి చేతివాటం చూపించిన పలువురు ఈ ప్రభుత్వంలో కూడా మంత్రుల దగ్గర పనిచేయటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పని చేసిన వారిని తీసుకోరాదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి సలహాదారుడు అజేయ్ కల్లం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించేందుకు ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు ప్రయత్నం చేశారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం అంగీకరించలేదు. తమ రికార్డు బాగో లేకపోయినా సాధారణ పరిపాలన శాఖలో పైరవీలు చేస్తూ ఉత్తర్వులు పొందటానికి నానా యాగి చేస్తున్నారు. వారిలో కొందరు తమ సర్వీసు అంతా పైరవీలు చేసే పోస్ట్ లలో ఉండటానికే నానా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలలో మంత్రుల దగ్గర పనిచేసి ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి వద్ద వ్యక్తి వ్యవసాయ శాఖ ఉద్యోగి. మాజీ మంత్రి కిమిడి మృణాళిని వద్ద ఆయన పనిచేశారు. కొద్దిరోజులలోనే అవినీతి ఆరోపణలు రావడంతో ఉద్వాసనకు గురిఅయ్యారు. తరువాత శాసన సభ కమిటీ చైర్మన్ ల వద్ద చేరేరు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి వద్ద అన్నీ తానెయై వ్యహారం నడుపుతున్నారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఈయన పీఎ గా రావటానికి పెద్ద పైరవి చేసినట్టు తెలిసింది. అదేవిధంగా మాజీ ఉప ముఖ్య మంత్రి కే ఈ కృష్ణమూర్తి వద్ద పనిచేసిన ప్రసాద్ కడపకు చెందిన మంత్రి పాషా వద్ద, మరో మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వద్ద పనిచేసిన నారాయణ మంత్రి మోపిదేవి వద్ద, గతంలో ఆనం రామనారాయణ రెడ్ది వద్ద పని చేసిన కాశీ మంత్రి కన్నబాబు వద్ద, కళా వెంకటరావు వద్ద పనిచేసిన శివ మంత్రి వనిత వద్ద పనిచేస్తున్నారు. వీరికి అధికారికంగా ఉత్తరువులు రాకపోయినా అధికారం చెలాయిస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారికీ ప్రస్తుతం అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసినా పైరవీ కారులు తమ ప్రయత్నాలు ఆపడం లేదు. వీరి వల్ల ప్రభుత్వ రహస్యాలు బైటకి వెళ్ళి పోతాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే వీరెవరికి జీతాలు రావు, అధికారికంగా నియమితులు కాలేదు కాబట్టి. అయినా ఆనందంగా పని చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. o
previous post
next post