39.2 C
Hyderabad
April 30, 2024 22: 00 PM
Slider హైదరాబాద్

ఏప్రిల్ 24న హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ గర్జన

#bachalikurabalaraju

ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చి మనువాదుల హిందూ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని తెలంగాణ దళిత దండు రాష్ట్ర అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేంద్ర హోం మంత్రి అమీత్ షా రాజ్యాంగాన్ని మార్చాలని కోరుతున్నారని ఆయన గుర్తు చేశారు.

రాజ్యసభలో కేరళ ఎంపీ అల్పోన్స్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పీఠిక మార్చాల్సింది గా కోరారని ఆయన గుర్తు చేశారు. మెజార్టీ ప్రజల స్వేచ్ఛను హరించి, అసమానతలు పెంచి పోషించి సౌబ్రతత్వాన్ని హత్య చేసి అమానుషమైన కుల దొంతర సమాజాన్ని నెలకొల్పిన మనువాద రాజ్యాగం తీసుకువస్తారా అని ఆయన ప్రశ్నించారు.

సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రసాదిస్తున్న రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లను ఎత్తి వేయకుండానే దొడ్డిదారిన రిజర్వేషన్లు తొలగించే కుట్ర పన్నుతున్న పాలకులకు ఇక నుంచి అయిన కనువిప్పు కలగాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 24న  హైదరాబాద్ నడిబొడ్డున 1000 డప్పులతో గర్జన చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే

Bhavani

ప్రజలు కట్టిన పన్నులతో జగన్ మత రాజకీయాలు

Bhavani

అతి చిన్న వయ‌స్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్య‌క్తి బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్

Satyam NEWS

Leave a Comment