24.7 C
Hyderabad
March 26, 2025 10: 12 AM
Slider ప్రకాశం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి

#DarshiKurcheduRoad

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాయకుడి లక్షణం. ఎన్నికలలో చెప్పిన పనులు ఒక్కొక్కటిగా చేయడం దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యేకత. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న దర్శి నుంచి కురిచేడు డబల్ రోడ్డుకు నేడు ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగమైన ఈ రోడ్డును  24 కోట్ల 50 లక్షల తో నిర్మించనున్నారు. రోడ్డు పనులకు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మండల ఇన్ ఛార్జ్ మద్దిశెట్టి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎన్నో ఏళ్లుగా కురిచేడు మండల ప్రజలు ,దర్శి మండల ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కురిచేడు దర్శి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో భౌతిక దూరం పాటించడం గమనార్హం.

Related posts

అణగారిన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగ

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న ఎం.జి.ఆర్

Satyam NEWS

అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment