38.2 C
Hyderabad
April 27, 2024 16: 20 PM
Slider విజయనగరం

బెటాలియన్ కమాండెంట్ తో ఎస్పీ దీపిక ఆయుధ పూజ…!

#depikaips

విజయ దశమి పండగ సందర్భంగా  విజయనగరం ఆర్మ్డ్ రిజర్వు విభాగంలోని ఆయుధగారం, మోటారు ట్రాన్స్ పో ర్ట్  ఆర్గనైజేషన్ లో జిల్లా ఎస్పీ  ఎం.దీపిక, ఆమె భర్త చింతలవలస 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా పోలీసు విభాగాలకు అన్ని విధాలుగా శుభాలు జరగాలని ప్రార్థనలు చేసి, వేద పండితుల ఆశీర్వచనం పొందారు. జిల్లా ఎస్పీ  ప్రజలకు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, దసరా పండగ జరుపుకోవాలని కోరారు.

ఈ పూజా కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, ఓఎస్డీ  ఎన్.సూర్యచంద్ర రావు, విజయనగరం డీఎస్పీ  అనిల్ పులిపాటి, ఎస్బీ సిఐలు ఎన్.శ్రీనివాసరావు,  జి.రాంబాబు, ఆర్ ఐలు  చిరంజీవి, పి. నాగేశ్వరరావు, మరియన్ రాజు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS

వనపర్తి జిల్లా పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

డబుల్ బెడ్ రూంల నిర్మాణం నాణ్యతతో ఉండాలి

Satyam NEWS

Leave a Comment