26.7 C
Hyderabad
May 1, 2025 06: 03 AM
Slider జాతీయం

సైన్టిఫిక్ బట్:మేక పిల్లముఖం అచ్చం మనిషిలా పూజలు

goat give birth to man face

వీరబ్రహ్మం గారి బోధనలు నిజమవుతాయనిపిస్తుంది.మేక కు అచ్చం మనిషిలా ఉన్న ఒక పిల్ల పుట్టడం ఈ విషయాన్నీ ధ్రువీకరించింది.వివారాల్లోకివెళితే రాజస్థాన్‌లోని నిమోదియాలోని విచిత్రం చోటుచేసుకుంది. ఓ మేకకు పుట్టిన పిల్ల ముఖం అచ్చం మనిషిలా ఉండటంతో ప్రజలు తండోప తండాలు చూడటానికి వచ్చారు.వచ్చినా వారు చూసి వెళితే పర్వాలేదు వారు దానికి పూజలు చేయడం మొదలెట్టారు.

ఈ సమాచారం తెలియగానేచుట్టూ పక్కల గ్రామాల ప్రజలంతా దాన్ని చూసేందుకు ఆ గ్రామానికి చేరుకుంటున్నారు. ఆ మేక దేవుడి ప్రతిరూపమని, అందుకే పూజలు చేస్తున్నామని స్థానికులు తెలుపుతున్నారు. ముఖేష్జీ ప్రజాపాప్ అనే వ్యక్తికి చెందిన మేకకు ఈ పిల్ల జన్మించింది. దాని ముఖం మేక తరహాలో కాకుండా సమాంతరంగా ఉండటంతో అది మనిషి ముఖంలా కనిపిస్తోంది.

సైక్లోపియా అనే సమస్య వల్ల జంతువుల ముఖంలో మార్పులు వస్తాయని, ఇది ఒక జన్యు సమస్య మాత్రమేనని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 16వేల జంతువుల్లో ఒకదానికి ఇలాంటి సమస్య వస్తుందన్నారు. అయితే, ఇది కేవలం జంతువులకే పరిమితం కాదని, మనుషులకు కూడా వస్తుందని తెలిపారు.కాగా పూజలు చేయడానికి జనం ఎగబడటం తో అక్కడ పూజ స్టోర్లు పూలదండల అమ్మకాల జోరు పెరిగింది.

Related posts

డేంజర్ ట్రెడిషన్ : తమిళనాడులో మొదలైన జల్లికట్టు

Satyam NEWS

కేసీఆర్ ఫామ్ హౌస్ డ్యూటీ పోలీసు ఆత్మహత్య

Satyam NEWS

ఇసుక కొరతపై గుంటూరులో లోకేష్ నిరసన దీక్ష

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!