40.2 C
Hyderabad
April 26, 2024 14: 17 PM
Slider జాతీయం

డేలైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీలో మొట్టమొదటి స్టార్టరప్ కు ప్రోత్సాహం

#daylightharvesting

కార్బన్ ఉనికిని తగ్గించి  భవన ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తాజా డే లైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ లో ఒక ప్రత్యేకమైన స్టార్ట్-అప్ ను ప్రోత్సహించాలని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

డేలైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ కు సంబంధించి  భారతదేశం లోని ఏకైక స్టార్ట్-అప్ కంపెనీ హైదరాబాద్ లోని  “స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్” కోసం భారతదేశంలో ఏకైక స్టార్ట్-అప్ కంపెనీ డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చట్టబద్ధ సంస్థ టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డుతో ఒక ఎమ్ఒయుపై సంతకం చేసింది. 24×7 ప్రాతిపదికన బేస్మెంట్ విద్యుద్దీకరణ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి పది కోట్ల ప్రాజెక్టులో రూ.5కోట్ల ను  టిడిబి స్కైషేడ్ కంపెనీకి ఇస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

సహజ సూర్యకాంతి తో భవనాలకు ప్రకాశం

ఏట్రియంలు , సోలార్ థర్మల్ టెక్నాలజీలను నిర్మించడానికి పెద్ద స్కైలైట్ డోమ్ ల రూపకల్పన,నిర్మాణ కార్యకలాపాలతో ప్రారంభించి మూలాలలో కంపెనీ నిమగ్నమై ఉందని ఆయన చెప్పారు. స్టార్ట్-అప్ ఇప్పుడు మానవ కేంద్రిత- వాతావరణ అనుకూల, అన్వయిత భవన ముఖభాగాలు , సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ డే లైటింగ్ వ్యవస్థ అనే మరో రెండు సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.

ఈ రెండు వ్యవస్థలు పగటి పూట కొత్త క్షితిజాన్ని ఇస్తాయి . ఈ ఉత్పత్తులు సులభంగా భరించకలిగేవి, స్వీకరించదగినవి ఇంకా ఆర్థికంగా ఆచరణీయమైనవి. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సహజంగా పగటి పూట గదుల లోకి సహజ సూర్యకాంతి వస్తుందని, సౌర శక్తి స్పెక్ట్రమ్ 45% శక్తిని కనిపించే కాంతిగా కలిగి ఉందని, దీనిని రోజుకు సుమారు 9-11 గంటల పాటు భవన ప్రకాశానికి ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2014 నుండి ఈ ప్రాంతంలో పనిచేస్తోందని, ప్రభుత్వ సంస్థలు, పిఎస్ యులు, కార్పొరేట్ నుండి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా-చెన్నై, తెలంగాణ సెక్రటేరియట్, పిఎంఓ కార్యాలయం సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ, ఎన్ టిపిసి, అమెజాన్, క్యాటర్ పిల్లర్, ఐకియా, మహీంద్రా, టాటా మోటార్స్ హీరో మోటార్స్, ఎయిర్ పోర్ట్ అథారిటీతో సహా యదాద్రీ ఆలయం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, శివాలయం, బోహ్రా మసీదు మొదలైన కొన్ని మత పరమైన నిర్మాణాల వరకు  వినియోగదారుల కోసం పగటి పూట వెలుగులు నింపుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

అయోధ్య ఆలయాన్ని కూడా పగలు రాత్రి వెలిగిం చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద విస్తరణ ప్రణాళికతో, భారతదేశం స్థిరమైన ఇంధన పరిష్కారాలను సార్వత్రికంగా అందుబాటు చేసుకోవడం, గణనీయమైన ఆర్థిక, పర్యావరణ ,సామాజిక ప్రభావంతో తక్కువ కార్బన్ భవిష్యత్తును ప్రారంభించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Related posts

అవయవదానంతో అమరుడైన రాజేశ్వరరావు

Satyam NEWS

Professional What Homeopathic Remedy Can I Get For High Blood Pressure What If Your Cholesterol Is High Resistance Training Can Lower Blood Pressure As Much As

Bhavani

12న జరిగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత భేరి జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment