40.2 C
Hyderabad
April 26, 2024 12: 16 PM
Slider జాతీయం

గోవాలో ఆగని మరణ మృదంగం: మరో 13 మంది మృతి

#goa medical college

గోవాలో మరణ మృదంగం ఆగడం లేదు. నాలుగు రోజుల్లో మొత్తం 75 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలారు. శుక్రవారం ఒక్క రోజే గోవా మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందక మరో 13 మంది మరణించారు. బొంబాయి హైకోర్టులోని గోవా బెంచ్ ప్రశ్నించినా ఆ రాష్ట్ర ప్రభుత్వం రోగుల మరణాలకు కారణాలు వెల్లడించడం లేదు. ‘‘మౌలిక సదుపాయాల లేమి కారణంగా కొందరు చనిపోతున్నారు’’ అని మాత్రమే గోవా ప్రభుత్వం చెబుతున్నది. కొన్ని చోట్ల ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయని మాత్రమే ప్రభుత్వం చెబుతున్నది. ఆక్సిజన్ సిలెండర్లను తీసుకువచ్చే ట్రాక్టర్ సకాలంలో తీసుకురాలేకపోవడం, ఆక్సిజన్ సిలెండర్ల హబ్ కు సకాలంలో అమర్చకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగిందని మాత్రమే గోవా ప్రభుత్వం కోర్టు కు తెలిపింది. మంగళవారంనాడు 26 మంది రోగులు చనిపోగా బుధవారంనాడు 21 మంది, గురువారంనాడు 15 మంది, శుక్రవారంనాడు 13 మంది రోగులు చనిపోయారు. అయినా ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్ధించుకుంటూనే ఉంది.

Related posts

నల్ల పోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

Bhavani

ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని పూజలు

Satyam NEWS

Leave a Comment