38.2 C
Hyderabad
April 29, 2024 13: 52 PM
Slider సినిమా

తగ్గుతున్న సినీ నిర్మాణాలు

#TELUGU HEROS

కరోనా దెబ్బకి అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కుదేలయింది. అసలు సినిమా రంగమే ఎక్కువగా దెబ్బ తింది కరోనా వల్ల. కరోనా రావడంతోనే ముందు సినిమా హాళ్లు మూసివేసి, సినిమా షూటింగ్స్ బంద్ చేశారు. దీంతో దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు భారీ దెబ్బ తగిలింది. సినిమా రంగం కొన్ని వేల కోట్లు నష్టపోయింది.

తాజాగా కేంద్ర సెన్సార్ బోర్డు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన సినిమాల లిస్ట్ అంతా ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం కరోనా వల్ల సినిమా నిర్మాణం బాగా తగ్గిందని, దేశం మొత్తం మీద సినిమాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపింది. సెన్సార్ బోర్డు లెక్క ప్రకారం 2018-2019లో 22,570 చిత్రాల ప్రదర్శనకు సెన్సార్ క్లియర్ చేశారు. 2019-20లో 20,593 సినిమాలకు అనుమతి ఇచ్చారు.

అయితే కరోనా దెబ్బకు అది దారుణంగా పడిపోయి 2020-2021లో కేవలం 8,299 సినిమాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఇక 2021-22లో కూడా కేవలం 12,719 సినిమాలకు అనుమతి ఇవ్వగా 2022-23లో మాత్రం ఈ సంఖ్య కొద్దిగా పెరిగి 18,070 సినిమాలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. అంటే అన్ని సినిమాలు బయటకి వచ్చాయి. సెన్సార్ బోర్డు ఇచ్చిన ఈ లెక్కలో ఫీచర్‌ ఫిల్మ్స్‌, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, విదేశీ చిత్రాలు.. అన్ని కలిపి ఉన్నాయి.

కరోనా కారణంగా కొన్నాళ్ళు సినిమా షూటింగ్స్ ఆపేయడం, సినిమా హాళ్లు మూసేయడంతో సినిమా నిర్మాణం కూడా ఆపేశారు. డబ్బులు వస్తాయో రావో, థియేటర్స్ కి జనాలు వస్తారో రారో అని చాలా మంది సినిమా నిర్మాణం ఆపేశారు. గతంతో పోలిస్తే ఈ మూడు సంవత్సరాలు సినిమాల నిర్మాణం తగ్గింది. అదే సమయంలో ఓటీటీ ప్రభావం ఎక్కువవడంతో మంచి సినిమాలు, కొత్త కొత్త కంటెంట్స్, ఓటీటీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇటీవల మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రానున్న రోజుల్లో సినిమా నిర్మాణం మరింత పెరిగి సినిమాల సంఖ్య కూడా పెరగనుంది.

తెలుగు సినీ పరిశ్రమలో కరోనా తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నిర్మాణ సంస్థల విషయంలో ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2019 ముందు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన నిర్మాణ సంస్థలు కరోనా తర్వాత దాదాపుగా చాలావరకు కనుమరుగయ్యాయి. నిర్మాణ వ్యయానికి తలొగ్గి.. క్లోజ్ అయిన కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ, అన్ని ఒడిదుడుకులు తట్టుకొని టాలీవుడ్ లో మూడు బడా సంస్థలు మాత్రమే నిలబడ్డాయి. భారీ బడ్జెట్ చిత్రాలని తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాయి.

Related posts

పాకిస్తాన్ వాడే మాటల్నే మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

Satyam NEWS

సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకున్న విజయనగరం మ‌త్స్య ప్ర‌ద‌ర్శ‌న‌

Satyam NEWS

చైనాతో లింకులు ఉన్న ప్రతిపక్ష నేత ఇళ్లపై పోలీసు దాడులు

Satyam NEWS

Leave a Comment