38.2 C
Hyderabad
April 28, 2024 22: 57 PM
Slider ఖమ్మం

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి

#Collector Dr. Priyanka

అర్హులకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, 2వ విడత గొర్రెల పంపిణీ, కారుణ్య నియామకాలు తదితర అంశాల పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. కోటి వృక్షార్చనలో జిల్లాకు కేటాయించిన 4 లక్షల 85 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు.

మొక్కలు నాటేందుకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతిలల్లో గుర్తించిన స్థలాల్లో గుంతల తవ్వకం చేపట్టాలని అన్నారు. తెలంగాణకు హరితహారం లక్ష్యాలను ఆగస్టు 26 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతివారం గొర్రెల యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, గొర్రెల కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ, గొర్రెలకు బీమా సౌకర్యం తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని కలెక్టర్ పేర్కొన్నారు.

బీసి కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం వివరాలు ఆన్ లైన్ లో నమోదులు చేయాలని చెప్పారు. మైనారిటీలకు ఆర్థిక సహాయం సంబంధించి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమ అధికారికి సూచించారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ సంబంధించి జిల్లా కమిటి స్క్రూటినీ పూర్తి చేయాలని చెప్పారు. గృహలక్ష్మి పథక దరఖాస్తుల విచారణ క్షేత్రస్థాయిలో ధృవీకరణ పూర్తి చేయుటలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని, లబ్దిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.సోషల్ వెల్ఫేర్ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని అన్నారు.

Related posts

ఏప్రిల్ 18న శ్రీ భాష్యకారుల సాత్తుమొర‌

Satyam NEWS

బండి సంజయ్ పాదయాత్ర తో ప్రజల్లో వెలిగిన చైతన్య జ్యోతి

Satyam NEWS

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment