33.7 C
Hyderabad
April 27, 2024 23: 39 PM
Slider విజయనగరం

డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం అన్యాయం…!

సైన్స్ వాక్ తో విజయనగరం లో జన విజ్ఞాన వేదిక కార్యక్రమం…!

పాఠ్య పుస్తకాలలో శాస్త్ర విజ్ఞానం తెలిపే అంశాలను తొలగించడం అన్యాయం టూ జన విజ్ఞాన వేదిక పేర్కొంది. దీన్ని నిరసిస్తూ విజయనగరం లో జన విజ్ఞాన వేదిక సైన్స్ వాక్ నిర్వహించింది.ఈ మేరకు విజయనగరం లో నవయుగ వైతాళికుడు గురజాడ స్వగృహం నుంచీ మూడు లాంతర్లు, గంటస్థంభం, అంబేడ్కర్ భవనం వరకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో “సైన్స్ వాక్” జరిగింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్… గురజాడ స్వగృహంలో మాట్లాడుతూ…. పాఠ్య పుస్తకాల ద్వారానే పిల్లలో విజ్ఞానం మొలకెత్తగలమని ఆ ఉద్దేశ్యం తో…పుస్తకాలలో విజ్ఞాన సర్వస్వాన్ని పొందుపరిచారని అన్నారు. కానీ ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం… ఆ పాఠాలను తొలగించి… మరో చరిత్ర ను నేటి సమాజానికి తెలియ చెబుతున్నాయని అది సరికాదన్నారు. అసత్య చరిత్ర ను…ప్రస్తుత సమాజంపై రుద్దుతోందని…అందులో భాగమే…డార్విన్ సిద్ధాంతం తొలగించడం అని అన్నారు. తక్షణమే తొలగించిన సిలబస్ ను తిరిగి పునరిద్దరించాలని జన విజ్ఞాన వేదిక ఈ సైన్స్ వాక్ చేపట్టిందని తెలిపారు.

Related posts

మలబార్ గోల్డ్ ట్రస్ట్ సహాయం 16 లక్షలు

Satyam NEWS

సక్సెస్ సెల్ఫీకి ప్రిన్స్ సంతకం

Satyam NEWS

మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment