38.2 C
Hyderabad
April 29, 2024 19: 14 PM
Slider జాతీయం

ఢిల్లీ సిఏఏ నిరసనల్లో ఒక కానిస్టేబుల్ మృతి

delhi fire

గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు నేడు హింసాత్మకంగా మారాయి. ఒక కానిస్టేబుల్ మరణించగా డీసీపీతో బాటు పలువురు గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో వరుసగా రెండవ రోజు పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. రెండు వాహనాలను ఆందోళనకారులు తగులపెట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్ పీసీ సెక్షన్ 144 ను విధించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) జైరాబాద్, మౌజాపూర్-బాబాపూర్, గోకులపురి, జోహ్రి ఎన్ క్లేవ్, శివ్ విహార్ స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేశారు. ఈ స్టేషన్లలో రైళ్లు నిలవడం లేదు.

ఇదిలావుండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు నిరసనకారులు నిగ్రహం పాటించాలని హితవు పలికారు.

Related posts

బెంగాల్ ప్రజలకు అక్క కాదు… మేనల్లుడికి అత్త మాత్రమే

Satyam NEWS

డొనేషన్ మాఫియా: కరోనా కాలంలోనూ ఇదేం దరిద్రం సోదరా?

Satyam NEWS

శాస్త్రోక్తంగా ప్రారంభమైన నమ్మాళ్వారుల అధ్యయనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment