29.7 C
Hyderabad
April 29, 2024 09: 45 AM
Slider వరంగల్

కల్లు గీత కార్మికుల్ని ఆదుకోవాలి

#taddytappers

భారీ వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన కల్లు గీత వృత్తి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ కోరారు. ప్రతి కుటుంబానికి 50 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ఆయన ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. గీత కార్మికులు రోజు రెండు పూటలా తాటిచ్చేట్లు ఎక్కితే నే తాటి కల్లు పారుతుందని అటువంటిది వరుసగా గత ఐదు రోజులుగా అధిక వర్షాలు కురువడం వల్ల తాటి చెట్లు ఎక్కలేక గీత వృత్తి ని కోల్పోవడం జరిగిందని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్ వరకు దాదాపు మూడు నెలలు కల్లు అధికంగా వచ్చే రోజులని, అలాంటిది ఈ రోజుల్లోనే వర్షాల కారణంగా ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అలాగే బీసీ లకు ఇస్తున్న విధంగా ప్రతి గీత కార్మికుని కి లక్ష రూపాయలు పూర్తి సబ్సిడీ ఇవ్వాలని రవిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts

“ఉప్పెన” నటి…విజయనగరం లో సందడి..!

Satyam NEWS

మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన మంత్రి తలసాని

Satyam NEWS

గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

Satyam NEWS

Leave a Comment