29.7 C
Hyderabad
April 29, 2024 08: 11 AM
Slider చిత్తూరు

తిరుపతి టీడీపీ టిక్కెట్టుకు భారీ డిమాండ్

#tirupati

తిరుపతి టిడిపి టిక్కెట్టుకు డిమాండ్ భారీగా పెరిగింది. జనసేన, తెలుగు దేశం పార్టీ పొత్తు ఖరారు కావడంతో గెలుపు ఖాయం అన్న విశ్వాసం పెరిగింది. దీనితో టిడిపిలో ఆశావహులు ఎక్కువయ్యారు. బలిజ, యాదవ, రెడ్డి వర్గీయులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. తామే బలమైన అభ్యర్థి అంటూ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. వైకాపా టిక్కెట్టు ఈ సారి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారునికి ఇస్తారని అంటున్నారు.

కార్పొరేషన్ ఉప మేయర్ అయిన ఆయన నగర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. YCP రెడ్డి అభ్యర్థిని నిలబెడితే, తెదేపాలో కూడా రెడ్డి అభ్యర్థికి ఇవ్వాలని ఒక వర్గం పట్టుపడుతోంది. మేయర్ గా ఉన్న శిరిష YCP అభ్యర్థి అవుతారని మరో వర్గం అంచనా వేస్తుంది. అలా జరిగితే, తెదేపాలోని యాదవులకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. తిరుపతిలో బేసిగ్గా బలిజ ఓటర్లు ఎక్కువని, కావున బలిజలకు ఇస్తేనే తిరుపతిలో విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ కేవలం 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేన అభ్యర్ధి చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లు వచ్చాయి. బలిజ సామాజిక వర్గం ఓట్లు చీలిపోవడం వల్లనే టిడిపి ఓడిపోయిందని అంటున్నారు. ఈసారి జనసేన కలసి రావడంతో విజయానికి డోకా లేదని భావిస్తున్నారు. జనసేన టిక్కెట్టు కోసం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, నియోజక ఇంచార్జి కిరణ్ రాయల్ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తిరుపతి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఇక్కడ గెలుపు అవకాశాలు గూర్చి చర్చించారు.

అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనకు మదనపల్లి స్థానం ఒక్కటి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఎస్సీలకు ఒక స్థానం  ఇవ్వాలంటే జి డి నెల్లూరు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. అక్కడ నియోజక  వర్గం ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రమైన తిరుపతిని వదులుకోవడానికి టిడిపి కార్యకర్తలు సిద్దంగా లేరు.ఈనేపథ్యంలో టిడిపి టిక్కెట్టుకు గిరాకీ పెరిగింది. మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గం ఇంచార్జి మున్నూరు సుగుణమ్మకు తిరిగి టిక్కెట్టు ఇస్తారని మెజారిటీ కార్యకర్తలు భావిస్తున్నారు.

ఆమె భర్త వెంకట్రామన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అకాల మరణం వల్ల 2015లో జరిగిన ఉపఎన్నికల్లో  సుగుణమ్మ పోటీ చేసి లక్షా పదహారు వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో ఆమె వైసిపి వేవ్అ లో కూడా భ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై పోటీ చేసి కేవలం 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి యాదవులకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

వైకాపా వారు యాదవ సామజిక వర్గానికి చెందిన డాక్టర్ బి ఆర్ శిరీషకు మేయర్ అవకాశం కల్పించారని, టిడిపిలో ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు అధ్యక్షడు జి నరసింహ యాదవ్ టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. ఆయన తొలి నుంచి పార్టీలో ఉన్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి నగర అభివృద్ది సంస్థ చైర్మన్ గా పనిచేశారు. అలాగే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఊకా విజయకుమార్ తీవ్ర స్థాయిలో టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన 2009 లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి పనిచేశారు. తరువాత టిడిపిలో చేరి కాపు అభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఉన్నారు.అలాగే యువ నేత జే బి శ్రీనివాస్ టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఆయనకు ఆర్థికం బలం, యువకుల తోడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. డాక్టర్ కోడూరు బాల సుబ్రమణ్యం కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన గత టిడిపి పాలనలో చురుకైన పాత్ర పోషించారు. వైకాపాలో రెడ్డి పోటీ చేస్తున్నందున రెడ్డికి టిక్కెట్టు ఇస్తే మంచిదన్న వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పడినప్పటి నుంచి సేవలు అందిస్తున్న రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. తిరుపతి స్థానికుడు అయిన అయనకు బలమైన బంధువర్గం, అనుచర గణం, కుటుంబ నేపథ్యం ఉంది. జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి రేసులో ఉన్నారు. ఆయన తండ్రి  మబ్బు రామిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఒక సారి మునిసిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు మాజీ కేంద్ర మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

Satyam NEWS

పేద విద్యార్థులపై నిర్లక్ష్యం దేనికి..?

Satyam NEWS

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

Satyam NEWS

Leave a Comment