Slider నల్గొండ

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు నిధులు

#MLA Chirumarthy Lingaiah

పట్టణంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తానని నల్లగొండ జిల్లా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గం లోని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించ తలపెట్టిన ప్లాట్ ఫాం, సిమెంట్ రోడ్డు, మరుగు దొడ్ల నిర్మాణ పనులకు బుధవారం రోజున మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ లో సరైన వసతులు లేక ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. చిట్యాల పట్టణం నూతన మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధి క్రమ క్రమేణా జరుగుతుందని అన్నారు.

మున్సిపాలిటీ ఏర్పడ్డ తరువాత అనేక సిమెంట్ రోడ్లు నిర్మించుకున్నామని, వీధి దీపాలు అలంకరించుకున్నామని, పబ్లిక్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. నిధుల విడుదలను బట్టి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని లింగయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ ప్రభాకర్, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు జడల ఆది మల్లయ్య, ఆర్ ఓ వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, పందిరి గీత, జిట్టా పద్మ, రెముడాల లింగస్వామి, కోనేటి కృష్ణ, సిలివేరు మౌనిక, జమాండ్ల జయమ్మ, నాయకులు పాటి మాధవ రెడ్డి,   గుండెబోయిన సైదులు, కోమటిరెడ్డి రాంరెడ్డి, ఎండి జమీరొద్దీన్, జిట్టా బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

శత చిత్ర దార్శనికుడికి నివాళులు

Satyam NEWS

బాన్సువాడ ఆటోనగర్ కు శంకుస్థాపన

Satyam NEWS

మాదిగలు రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాలి

Satyam NEWS

Leave a Comment