24.7 C
Hyderabad
March 26, 2025 09: 50 AM
Slider నెల్లూరు

నెల్లూరు ఎంపీ ఆదాలకు “రూరల్” బాధ్యతల అప్పగింత

#MP Adala Prabhakar Reddy

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ నుంచి గురువారం ఉదయం పిలిపించారు.

ఆయన కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డితో ఆదాల ప్రభాకర్ రెడ్డి జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. రూరల్ నియోజకవర్గ బాధ్యతలను నిర్వహించేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఈ చర్చల్లో నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Related posts

రాజ‌రాజ చోర‌తో మ‌రింత గుర్తింపు వ‌స్తుంది: న‌టి సునైన

Satyam NEWS

హుజురాబాద్ అభివృద్ధి పనులకు ఆమోదం

Satyam NEWS

ఎటెన్షన్: రైతన్నలూ రైస్ మిల్లర్స్ తో జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment