ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.1 అడుగులు ఎత్తులో ధవళేశ్వరం బేరేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరానికి ఇన్ ఫ్లో తగ్గుతున్నా కూడా భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10.54 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమ క్రమంగా నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ, అదే రీతిలో క్రమక్రమంగా భద్రాచలం వద్ద నీటి మట్టం 43.20 అడుగులకు పైగా పెరుగుతుండడంతో పాటు ఇతర జలాశయాల నుండి వరద ప్రవాహం పెరగడంతో రేపటికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మరింతగా పెరిగే అవకాశ ఉందని అంచనా వేస్తున్నారు.
previous post
next post