30.7 C
Hyderabad
April 29, 2024 06: 51 AM
Slider ప్రత్యేకం

Dirty Game: పసి పిల్లల ప్రాణాలు తీస్తున్న ఐస్ క్రీములు

#ice cream

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ కూడలి దగ్గరలో మార్కెట్ కు వెళ్లేదారిలో కుడివైపున  పాత గోడల్లో పసి వాళ్ళ ప్రాణాలు తీసే అందుకే అన్నట్లు ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్నారు .

అక్కడ  వివిధ రసాయనాలతో పుల్ల ఐస్ క్రీమ్ లు, కప్ ఐస్ క్రీములు, చెరుకు రసం, సోడా, మొదలగు వాటిలో కలిపే ఐసు తయారు చేస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వఅనుమతులులేకుండానే ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా చిన్న పిల్లలకు హాని కలిగించే రసాయనాలతో  మురికి నీటితో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు.

ఇక్కడ చూస్తే ఘోరాతి ఘోరంగా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇటువంటి చోట నిలిచి ఉండాలంటే నే అసహ్యంగా ఉంటుంది. అటువంటి ఆ అపరిశుభ్రమైన చోట మురికి నీటితో పుల్ల ఐస్ క్రీమ్ లు పాల ఐస్ క్రీమ్ లు తయారు చేయడమే గాక వాటిలో  తియ్యగా ఉండే టందుకు, ఆకర్షించే రంగులో  ఉండేందుకు, మళ్లీ మళ్లీ తినాలనిపించే విధంగా వివిధ రసాయనాలతో ఈ ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్నారు.

చిన్నపిల్లలు గాక ఎవరు తిన్న అనారోగ్యానికి గురి కావడం తప్పదని చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది.అసలే ప్రస్తుతం కరోనా రెండవ మారు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటే వారి వ్యాపారం కోసం చిన్న పిల్లల, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు ఇటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related posts

రాజన్న రాజ్యం తెస్తాo 

Murali Krishna

తిరుమల శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేయడం కుదరదు

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డిసిపి

Satyam NEWS

Leave a Comment