38.2 C
Hyderabad
April 29, 2024 14: 17 PM
Slider విజయనగరం

దిశ జాగృతి యాత్ర‌లో మహిళా సంర‌క్ష‌క పోలీసుల‌దే కీల‌క పాత్ర‌

#disaapp

బొబ్బిలి,తెర్లాం,బ‌లిజిపేట పీఎస్ ప‌రిధిల‌లో దిశ జాగృతి యాత్ర‌

దాదాపు  నెల రోజుల పాటు ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  దిశ జాగృతి యాత్ర‌…అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిల‌లో సంచ‌రిస్తోంది. తొలుత జిల్లా కేంద్రంలోని బ్యారెక్స్ వ‌ద్ద ప్రారంభ‌మైన  ఆ యాత్ర‌..తాజాగా  బొబ్బిలి డివిజ‌న్ లోప‌ర్య‌టిస్తోంది.రెండు రోజుల క్రితం బ‌లిజిపేట‌,తెర్లాంలో ప‌ర్య‌టించిన  దిశ జాగృతి యాత్ర‌…తాజాగా… బొబ్బిలి లోని శ్రీ వేణుగోపాల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో  దిశ జాగృతి బృందం చైత‌న్య కార్య‌క్ర‌మం చేపట్టింది. ఈ మేర‌కు హైస్కూల్ విద్యార్ధినీల‌ను అవ‌గాహ‌న ప‌రుస్తూ…ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు శ్ర‌ద్ద వ‌హించాల‌న్నారు.

చెడు వ్య‌స‌నాలు…దుర అల‌వాట్ల‌కు దూరంగా ఉంటూ… సత్ప్రవర్తనతో మెలిగాల‌న్నారు.  క‌న్న‌వారికి మంచి పేరు తెచ్చే విధంగా విద్యార్ధినీలు అంద‌రూ మెల‌గాల‌ని..హైస్కూల్ ద‌శ‌…యువ‌త‌కు మంచి వ‌య‌స్సు అని…అప్పుడే కేరిర్ కు ప్లాన్ చేసుకోవాల‌ని…పాట‌ల ద్వారా..దిశ జాగృతి యాత్ర విద్యార్ధినీల‌ను కోరింది.అలాగే ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రలోభాలు, వ్యామోహాలకు స్వస్తి పలకాలని, మహిళల రక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాటశాలలో ఏర్పాటు చేశారు.అంత‌కుముందు బలిజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దిశ జాగృతి బృందం సందర్శించి, విద్యార్థులను సత్ప్రవర్తనతో మెలిగి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రలోభాలు, వ్యామోహాలకు స్వస్తి పలకాలని, మహిళల రక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాటశాలలో ఏర్పాటు చేశారు. అలాగే  తెర్లాం మండలం, పెరుమలి ఎ.పి.మోడల్ పాఠశాలలో దిశ జాగృతి యాత్ర ప‌ర్య‌టించింది.ఈ సంద‌ర్బంగా గ్రామ‌స్థులు..హైస్కూళ్ల విద్యార్దినీలు.. మ‌హిళా సంర‌క్షక పోలీసుల‌కు  పూల దండ‌లు వేసి మ‌రీస్వాగ‌తం ప‌లికారు.

ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ బి.మోహన రావు, బొబ్బిలి సీ.ఐ ఎం.నాగేశ్వర రావు,  ఎస్.ఐ వి.జ్ణాన ప్రసాద్,బొబ్బిలి రూరల్ సి.ఐ, పి.శోభన్ బాబు, బలిజిపేట ఎస్.ఐ వి.పాపా రావు,తెర్లాం ఎస్.ఐ సురేంద్ర నాయుడు గాయకులు గజల్ గాంధీ, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

చంద్రబాబుపై తిరిగి తెరుచుకున్న ఏసిబి కేసు

Satyam NEWS

నవంబర్ 12 నుంచి బాలోత్సవ్

Murali Krishna

జగనన్న రాజ్యంలో అయ్యో రామా…..

Satyam NEWS

Leave a Comment