33.7 C
Hyderabad
April 29, 2024 02: 07 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ ప్రభుత్వమా? కల్తీ కల్లును అరిక‌ట్ట‌లేవా?

#katragadda prasuna

తెలంగాణ రాష్ట్రంలో క‌ల్తీ క‌ల్లు పేద‌ల ప్రాణాల‌ను తీస్తుంద‌ని, వారి ఆర్థిక ప‌రిస్థితుల‌ను దెబ్బ‌తీస్తోంద‌ని మాజీ ఎమ్మెల్యే, టి.టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌ల్తీ క‌ల్లు నియంత్రణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం చోద్యం చూస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇటీవ‌ల కాలంలో క‌ల్తీ క‌ల్లు తాగి ఆసుప‌త్రుల పాలై మ‌ర‌ణించిన కొన్ని కుటుంబాల‌ను చూస్తుంటే క‌డుపు తరుక్కుపోతుంద‌ని ప్ర‌భుత్వం ఈ అంశంలో ఎందుకు తాత్సారం చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. స‌హ‌జ‌ద్ధంగా తాటి, ఈత చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా, నిషేధిత మత్తు పదార్థాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు కష్టజీవులను కాటేస్తుంది.

ఎందరో బలి అవుతున్నా కనిపించడం లేదా?

శారీరక శ్రమతో అలసిపోయి ఉపశమనం పొందడానికి ఈ కల్తీకల్లుకు అలవాటైన కష్టజీవులు.. దానికి బానిసలుగా మారిపోతున్నారు.ఎంతో మంది నిరుపేద కుటుంబాలు రోడ్డు న పడ్డాయి .. ఏళ్ల తరబడి కృత్రిమ కల్లు తాగుతున్న వారంతా ఎముకలగూడులా, జీవచ్ఛవాల్లా తయారవుతున్నారు. రసాయనాల మోతాదు తగ్గితే తట్టుకోలేక కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందాకు ఎంతోమంది బలైన ఘటనలున్నాయి. ఉమ్మడిజిల్లాలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ముఖ్యంగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో కొన్ని వందల కుటుంబాలు ఈ కల్తీ కల్లు ఊబిలో చిక్కుకొని మతిస్థిమితం కోల్పోయి చాలా  కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల కాలంలో మహిళలు పై జరిగిన  అఘాయిత్యా   ఘటన లో కూడా కల్తీ కల్లు తాగి అఘాయిత్యం పాల్పడ్డ వారే ఎక్కువ గా ఉన్నారు   అని చెప్పడానికి బాధగా ఉంది. ఏదైనా ఘటన జరిగిన సమయంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు అని కాట్రగడ్డ ప్రసూన ధ్వజమెత్తారు.

జోరుగా సాగుతున్న కల్తీకల్లు వ్యాపారం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో కల్తీకల్లు వ్యాపారం జోరుగా సాగుతుంది. స్థానిక అధికార పార్టీ నాయకులు, జిల్లాస్థాయి అధికారులు కల్లు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుండటంతో ఈ వ్యాపారం దర్జాగా సాగుతోంది. కల్లు ప్రియులను బానిసలుగా మార్చి బిజినెస్‌ పెంచుకునేందుకు వ్యాపారులు నిషేధిత మత్తు పదార్థాలను వాడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్లోరోఫాం, అల్ఫాజోలం, డైజోఫాంలను తెచ్చి కృత్రిమ కల్లుగా తయారు చేస్తున్నారు.. ఈ కల్తీ కల్లు వల్ల నిరుపేద కుటుంబాలు రోడ్డు నా పడుతున్నాయి.

మతిస్థిమితం కోల్పోయిన ఎన్నో కుటుంబాలు నా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి .. నా వ్యక్తిగత సహాయకురాలుగా పనిచేసే ఇద్దరు మహిళలు వారి కుటుంబ‌ సభ్యులు కూడా ఈ కల్తీ కల్లు కోరల్లో చిక్కుకొని మతిస్థిమితం కోల్పోయారు.. అటువంటి వారిని చూస్తుంటే గుండె  తరుక్కు పోతుంది అని కాట్రగడ్డ ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు తయారీలో యూరియా, కుంకుడు కాయల రసం, పులుపు పౌడర్‌, శాక్రిన్‌ పొడి, బియ్యం పిండిని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రభుత్వం కల్తీకల్లును పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతం  ఆవుతున్నాయి అని ప్రభుత్వం పై మండి పడ్డారు.

వాస్తవంగా కల్తీకల్లు తాగి మృతి చెందిన కేసులు వందల సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. కేసులు నమోదు చేసేందుకు ఎక్సైజ్‌ అధికారులు ససేమిరా అంటుండంతో కల్తీకల్లు మరణాలు బహిర్గతం కావడం లేదు. ప్రభుత్వం తక్షణమే ఇటువంటి మరణాలపైన శ్వేతపత్రం విడుదల చేసి ..బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరవున డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి ఘటనలు  యావత్తు తెలంగాణ లో కల్తీ కల్లు ఊబిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.కానీ  ఇప్పటివరకు ఎవరూ కల్లు తాగి మృతి చెందలేదని ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొనటం గమనార్హం.

కల్తీ కల్లుతో కన్నుమూస్తున్న వారెందరో…

పొద్దంతా పనిచేసిన శ్రమజీవి అలసటను మరిచేందుకు కల్లు తాగి చివరికి దానికే బానిసలై శాశ్వతంగా కన్నుమూస్తున్నారు. కల్లు ఉత్పత్తి మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలో తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కల్లును దిగుమతి చేసుకుంటున్నారు. దానిని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు నిషేధిత పదార్థాలను కలిపి కృత్రిమంగా తయారు చేసి అమ్ముతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం సుమారు వెయ్యి కి పైన లైసెన్స్‌డ్‌ కల్లు దుకాణాలు ఉన్నట్టు గతంలో ప్రభుత్వం వెల్లడించింది.

అందులో టీఎ్‌ఫటీ (గీతకార్మికుల) లైసెన్స్‌లు ,టీసీఎస్‌ (కల్లు సొసైటీ) లైసెన్స్‌లు ఉన్నాయి. చెట్లు ఎక్కి కల్లు గీసేవాళ్లకే లైసెన్స్‌ ఇవ్వాల్సి ఉంది కానీ.. కొంతమందికి చెట్లు ఎక్కడం.. కల్లుగీయడం రాకున్నా.. లైసెన్స్‌లు ఇచ్చేశారన్న ఆరోపణలు వినిపిస్తోన్నాయి. దీని పై కూడా విచారణ జరిపి  నిజమైన కల్లు గీత కార్మికులు కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. స్థానిక ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోజు జాయిన్ అవుతున్నా వారిలో కల్తీ కల్లు బాధితులు ఎక్కువ గా ఉన్నారని ఆసుపత్రిలో వైద్యులు చెప్తున్నారు. సామాన్యుల ప్రాణాలకి రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. అలాగే తక్షణం ఇటువంటి కల్తీ వ్యాపారం చేసే వాళ్లపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన డిమాండ్ చేశారు.

Related posts

విశాఖ సముద్ర తీరంలో ఏం జరుగుతున్నది?

Satyam NEWS

సీఎం పర్యటనకు వినుకొండలో ఏర్పాట్లు పూర్తి

Bhavani

ఛా ఛా ఇదేం కోవిడ్ కేర్ సెంటర్?

Satyam NEWS

Leave a Comment