40.2 C
Hyderabad
April 29, 2024 16: 58 PM
Slider మహబూబ్ నగర్

జూపల్లిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు

#jupallykrishnarao

ప్రజల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పై అవాకులు చెవాకులు మాట్లాడితే సహించేది లేదని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ స్థానిక నాయకులు హెచ్చరించారు. తన అనుచరులపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టిన కారణంగా పోలీసు స్టేషన్ కు వెళ్లిన జూపల్లి కృష్ణారావుపై విమర్శలు చేయడం తగదని వారు అన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి సర్పంచ్ రంజిత్, ఉప సర్పంచ్ మునిస్వామి, వడ్ఢేమాన్ బిచ్చమన్న, అంబెడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు తగరం కురుమయ్య, కత్తి జానీ, జమదగ్ని, తగరం మనోజ్, నాని, మద్దిలేటి బాలస్వామి, సాయి, రమేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ దండోరా నాయకులు లేనిపోని అపోహలతో జూపల్లి పై ఆరోపణలు చేయడం తగదని వారన్నారు. ఎంఎల్ఏ ఆశీస్సులతో దళితబందు పొందిన నలుగురిని వెనకేసుకొని, ఎమ్మెల్యేకు కార్యకర్తలుగా ఉన్నవారిని వెంటేసుకొని మాట్లాడడం ఎందుకని వారు ప్రశ్నించారు. తెలంగాణ దండోరా నాయకుల  స్టేట్మెంట్ ఒక వర్గానికి కొమ్ము కాసినట్టు ఉందని, చట్టం ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికారికి బాసటగా నిలిచినట్టు గా ఉందని వారన్నారు. దళితుడైన జర్నలిస్టు రాజశేఖర్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడు సదరు SI పై అట్రాసిటీ కేసు పెట్టమని ఎందుకు పోరాడలేదని వారు ప్రశ్నించారు. అలాగే దళిత నాయకుడైన బచ్చలకూర బాలరాజు ను అవమానపర్చి స్టేషన్ బయటకు గెంటివేసిన Si పై అట్రాసిటీ కేసు పెట్టమని ఎందుకు డిమాండ్ చేయలేదని వారు ప్రశ్నించారు.

Related posts

హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

Satyam NEWS

అన్ని అసెంబ్లీల నుంచి తప్పుకున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ

Satyam NEWS

బడిబయట విద్యార్థులను వివరాలు గుర్తిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగస్థులు

Satyam NEWS

Leave a Comment