33.7 C
Hyderabad
April 29, 2024 02: 28 AM
Slider హైదరాబాద్

వైన్ షాపు కు అనుమతులు నిలిపివేయాలంటూ సంతకాల సేకరణ

#uppal

అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారే వైన్ షాపులకు జన సంచారం రద్దీగా ఉండే బస్టాండ్ ల పరిధిలో పర్మిషన్ లు నిలిపివేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏ ఐ వై ఎఫ్ భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ఉప్పల మండల సమితి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని మల్లాపూర్ శివ హెంటల్ బస్ స్టాప్ వద్ద వైన్ షాప్ కు అనుమతులు నిలిపివేయాలని భారత యువజన సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య ల  ఆధ్వర్యంలో  మల్లాపూర్ లో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య ఉప్పల్ మండల అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా మల్లాపూర్ శివ హెటల్ వద్ద బస్ స్టాప్ ఉందనీ  ఎంతో మంది మహిళలు, విద్యార్థిని లు ఆ బస్ స్టాప్  నుండి ప్రయాణాలు   కొనసాగిస్తుంటారు అన్నారు.

ఇదే బస్టాప్ వద్ద వైన్ షాప్ కు, పర్మిట్ రూమ్ కు అనుమతి ఇస్తే మహిళలు, విద్యార్థినీ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనీ తెలిపారు. ఆబ్కారీ శాఖ అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి బస్ స్టాఫ్ వద్ద వైన్ షాపు కు అనుమతి ఇవ్వొద్దు అంటూ సంతకాల సేకరణ తీసుకుని బస్ స్టాప్ వద్ద వైన్ షాప్ కు అనుమతులు ఇవ్వకూడదని. ఆబ్కారీ శాఖ ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత యువజన సమాఖ్య మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సత్యప్రసాద్, ప్రధానకార్యదర్శి ధర్మేంద్ర, నవీన్, ప్రదీప్, జ్యోతి, రవళి, కీర్తి, సుప్రియ, జాహ్నవి, హర్షిత తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి

Related posts

రంజాన్ తోఫా వితరణ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్ధులు

Satyam NEWS

కొల్లాపూర్ లో గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరం

Satyam NEWS

Leave a Comment