40.2 C
Hyderabad
April 29, 2024 16: 16 PM
Slider హైదరాబాద్

అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు

#doctorsday

అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారనీ, వైద్యం అంటే ఓ వృత్తిగా బ్రతికించే ఓ మహాశక్తి అని, సమాజ నిర్మాణం లో వైద్యుల పాత్ర కీలకమైందని  తిరుమల నగర్  లైన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ గవర్నర్ లయన్ K. హరీష్ రెడ్డి అన్నారు.

శుక్రవారం  డాక్టర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి అన్నారు. .భారత్ లో వైద్య విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని , విద్యార్థులు రష్యా, ఫిలిపిన్స్ వంటి దేశాలకు వెళ్ళటం బాధాకరం అని తెలిపారు.

డాక్టర్స్ డే సందర్భంగా తిరుమల నగర్ లైన్స్ క్లబ్   ఆధ్వర్యంలో  డా,, మర్తినేని ప్రియాంక , శ్రీనివాస్ నాయక్ లను ఘనంగా  సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్ V.కృష్ణప్రసాద్, రిజియన్ చైర్ పర్సన్ లయన్ జిడీ సంపత్ గౌడ్,జోన్ చైర్ పర్సన్ లయన్ D.చంద్రశేఖర్,సురేష్   ప్రెసిడెంట్ P. నవీన్ యాదవ్, సెక్రటరీ మహేశ్వరరావు గౌడ్, కోశాధికారి ప్రభాకరాచారి, లయన్ P. మల్లేష్ గౌడ్ గారు, లయన్ S. మురళిచారి,లయన్ P. మురళీకృష్ణ, లయన్  S.బాలరాజు  తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి       

Related posts

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆందోళన

Satyam NEWS

21 న టి‌ఆర్‌ఎస్ కీలక సమావేశం

Sub Editor 2

కరోనా ఎలర్ట్: మరి కొన్ని రోజులు లాక్ డౌన్ పాటించండి

Satyam NEWS

Leave a Comment