33.7 C
Hyderabad
April 28, 2024 00: 24 AM
Slider నల్గొండ

హైదరాబాద్ వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

#HyderabadFloods

హైదరాబాద్ లో వర్షాలకు నిరాశ్రయులైన వారి కోసం జమాతే ఉలేమా ద హింద్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ముస్లింలు విరాళాలు సేకరించారు. ముస్లిం మైనార్టీ సోదరుల వద్ద సేకరించిన విరాళాలను ముస్లిం మత పెద్ద ముఫ్తీ మొహమ్మద్ గౌసుద్దీన్ కి  అంద చేశారు.

ఈ సందర్భంగా గౌసుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ పాత బస్తీలో భారీ వర్షాలు, వరదలతో ఇండ్లలోకి నీరు వచ్చి  ఆహార పదార్థాలు, దుస్తులు,  తడిసిపోయాయని అన్నారు.

వండుకుని తినే పరిస్థితిలో కుటుంబాలు లేవని,  వేలాది మంది కుటుంబాలకు  పడుకోవటానికి, ఉండటానికి నివాస గృహాలు కూడా లేకుండా పోయాయని అన్నారు.

కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువులు లేకపోవటంతో వారు  ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతమని ఆయన అన్నారు.

మానవతా దృక్పథంతో ఆలోచించి నగదు గాని, వస్తురూపేణ దాతలు  ముందుకొచ్చి సహాయం అందించాలని అన్నారు. దాతలు హుజూర్‌నగర్ ఉస్మానియా మసీదులో సంప్రదించాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ అజీజ్ పాషా. ఎస్కే. మన్సూర్ అలీ. ఎస్కే. బిక్కన్ సాహెబ్.ఎస్కే. సైదా మేస్త్రీ.ఎస్కే. జానీపాషా. షేక్. మోహిన్.ఎండీ. ఖాజా మోయినొద్దీన్.ఎండీ.సిరాజ్.లతీఫ్.రషీద్ తదితరులు పాల్గొన్నారు. 

Related posts

కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి

Bhavani

శ్రీ లలితా సోమేశ్వరుడి దర్శనం కోసం కాలినడకన జూపల్లి

Satyam NEWS

గంగమ్మ ఆలయంలోని పురాతన స్తంభాలను పునర్నిర్మించాలి

Satyam NEWS

Leave a Comment