27.7 C
Hyderabad
April 30, 2024 08: 43 AM
Slider గుంటూరు

ఎమ్మెల్యే ఆదేశాలతో తాగునీటిలో ఇబ్బందులు పరిష్కరించిన ఇంజనీర్లు

#watertank

నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో కొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితం అయినట్లు ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తక్షణ చర్యలు తీసుకున్నారు. సంబంధిత మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఈ సమస్యను పర్యవేక్షించి సదరు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పురపాలక ఇంజనీరింగ్ విభాగం అధికారులు మున్సిపల్ ఇంజనీర్ మాల్యాద్రి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు నాయక్, స్వర్ణ రాజు వారి సిబ్బంది చెరువులను, పైపులైన్ సప్లై లను పరిశీలించారు. చెరువులో కాపర్ సల్ఫేట్ ను కలిపారు. అదే విధంగా ప్రధాన పైపులైన్లు మీద దేచవరం, చల్లగుండ్ల రెండు చోట్ల కవర్ వాల్వ్ తెరిచి పరీక్షించారు. ఇంజనీర్లు తక్షణ చర్యలు తీసుకోవడంతో యధావిధిగా మళ్లీ పట్టణంలో ఎటువంటి రంగు, వాసన లేకుండా  మంచి నీళ్లు రావడం ప్రారంభం అయింది.

Related posts

ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కారాలు

Satyam NEWS

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు

Satyam NEWS

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో యువతకు అవకాశం

Satyam NEWS

Leave a Comment