38.2 C
Hyderabad
April 29, 2024 21: 21 PM
Slider ముఖ్యంశాలు

కచ్చితమైన సేవలకోసం తెలంగాణలో ఇ-ఆఫీసు

#SomeshkumarIAS

ప్రభుత్వ కార్యాలయాలలో సమర్ధవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి ఇ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో ఇ -ఆఫీసును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇ -ఆఫీసు ద్వారా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడ నుండైన పని చేయడానికి వీలుకలుగడంతోపాటు, సమర్దవంతమైన పాలనను అందించవచ్చన్నారు.

సెక్రటేరియట్ లోని వైద్య, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ , కార్మిక శాఖ, బిసి సంక్షేమం, షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి శాఖ , మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు , పి.సి.బి. వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయాలలో ఇ -ఆఫీసును ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెక్రటేరియట్ లో 15 శాఖలలో  ఇ -ఆఫీసును అమలుచేస్తున్నామన్నారు.

మిగిలిన శాఖలలో e-ఆఫీస్ అమలును వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  కార్మిక శాఖ స్పెషల్ సి.యస్ రాణి కుముదిని, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పి.సి.బి. మెంబర్ సెక్రటరి నీతూ కుమారి ప్రసాద్ , ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరి రోనాల్డ్ రోస్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ మాల మహానాడు బలోపేతానికి చర్యలు

Satyam NEWS

ఎర్రగడ్డ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

ఘనంగా జరిగిన”నువ్వే నా ప్రాణం!” మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

Bhavani

Leave a Comment