30.7 C
Hyderabad
April 29, 2024 05: 57 AM
Slider నల్గొండ

ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభం

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమం వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న అసంఘటిత కార్మికులు,వలస కూలీలు అందరికీ వివిధ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ఈ శ్రమ్ పోర్టల్ రూపోందించారని,అసంఘటిత కార్మికుల గుర్తింపు కార్డు కోరకు టైలర్స్,బార్బర్లు,డ్రస్ మేకర్లు,వడ్రంగులు,ఆటో డ్రైవర్లు,రైతు కూలీలు,ఇటుక బట్టి కార్మికులు,ఎలక్ట్రికల్ వర్కర్లు, వివిధ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మేనేజర్ యాకుబ్ పాషా,మెప్మా సిబ్బంది మంద కనకదుర్గా, గోలి రాజేశ్వరి, తోటకూర సుజాత,నందిగామ పాపయ్య, ఇందిరాల నాగమణి,వీధి విక్రయదారులు రాపోలు శ్రీనివాసు,కొండలరావు, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

దళితులకు మూడెకరాలు భూమి కేటాయింపులో మోసం చేస్తున్న కేసీఆర్‌

Satyam NEWS

మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో హెలికాప్టర్ తో సహాయ చర్యలు

Bhavani

వెంకటగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గిరిజ కుమారి

Satyam NEWS

Leave a Comment