35.2 C
Hyderabad
April 27, 2024 14: 09 PM
Slider ముఖ్యంశాలు

విదేశీ విద్యకు ఆన్‌లైన్ వేదిక ఎడ్వాయ్‌

#edvoy

ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఐఇసి ఆబ్రాడ్ ఆరంభించిన సరికొత్త ఆన్‌లైన్ వేదిక ఏడ్వాయ్. విదేశాల్లో చదువులకు సంబంధించి దక్షిణాసియాలోని విద్యార్థులకు ఉచితంగా సలహా సహకారాలు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌కు ఇది ఉప‌యోగిస్తోంది.

అమెరికా, బ్రిట‌న్, లండ‌న్‌, కెన‌డా, ఐర్లాండ్‌లోని ఉన్న‌త విద్యాల‌యాల స‌మాచారాన్ని ఒకే చోట అందిస్తోంది. అక్క‌డి విద్యాసంస్థ‌లు, వాటికి ఉన్న ర్యాంకింగ్‌, స్కాల‌ర్‌షిప్స్ వంటి స‌మాచారం అంతా అందులో పొందుప‌రిచారు. ఎక్క‌డిక‌క్క‌డ లింకుల‌తో సాధ్య‌మైనంత ఎక్కువ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

కోర్సులు, స్కాల‌ర్‌షిప్స్‌కు సంబంధించి లోతైన స‌మాచార సేక‌ర‌ణ‌లో విద్యార్థుల‌కు రియ‌ల్ లైఫ్ అలాగే ఆర్టిఫీషియ‌ల్ అడ్వ‌యిజ‌ర్లు స‌హ‌క‌రిస్తారు. ద‌ర‌ఖాస్తు నుంచి చేర‌బోయే యూనివ‌ర్శిటీల్లో వ‌స‌తి, మెడిక‌ల్ ఇన్సూరెన్స్ వ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో తోడ్పాడునందిస్తారు. ఆస్ట్రేలియా అదేవిధంగా యూర‌ప్‌లోని మ‌రిన్ని దేశాల స‌మాచారాన్ని కూడా అందించే ప్ర‌య‌త్నంలో ప్ర‌స్తుతం ఉంది.

విదేశాల్లో చ‌దువుకోవాల‌న్న విద్యార్థుల‌కు టెక్నాల‌జీ స‌హ‌కారంతో అత్యున్న‌త సేవ‌లు అందించాల‌న్న‌ది త‌మ ఆకాంక్ష అని ఈ సంద‌ర్భంగా సంస్థ సీఈవో సాధిఖ్ భాషా వెల్ల‌డించారు. ఇత‌ర వివ‌రాల‌కు వెబ్‌సైట్  www.edvoy.com సంద‌ర్శించాల‌ని కోరారు.

Related posts

మామునూరు ఎయిర్ పోర్టు భూములపై మంత్రి ఎర్ర‌బెల్లితో క‌లెక్ట‌ర్ భేటీ

Bhavani

శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

మూడు భాషల్లో సోనీ చరిష్ట కొత్త ‘కాంట్రాక్ట్’

Satyam NEWS

Leave a Comment