కొన్ని కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అయితే ప్రతి దానికి సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఉంటుంది. నిజామాబాద్ పాత జిల్లా జుక్కల్ మండలం పెద్దఏడ్గి గ్రామ శివారులోని ఒక కోళ్లఫారంలో నేడు ఒక విచిత్రం జరిగింది. అందులో వందల సంఖ్యలో ఉన్న కోళ్లలో ఒక కోడి అతి తక్కువ సైజులో ఉన్న గుడ్డు పెట్టింది. ఆ కోడి ప్రతిసారీ గోళీ ఆకారంలో తక్కువ బరువుతో గుడ్డు పెడుతోందని నిర్వాహకుడు రాములు తెలిపారు.
సాధారణంగా గుడ్డు బరువు 60 నుంచి 70 గ్రాములు ఉంటుందని, దీని బరువు పాతిక గ్రాముల్లోపే ఉందని అతను అంటున్నాడు. చిన్న పరిమాణంలో గుడ్డు పెట్టేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పౌష్టికాహారం అందకపోవడం వల్ల ఇలా జరుగుతున్నదా అనేది అనుమానం. ఈ గుడ్డ్డు ను చూడటానికి ప్రజలు ఉత్సహం చూపారు.