37.2 C
Hyderabad
May 2, 2024 11: 46 AM
Slider తెలంగాణ

ఉపాధి పనుల్లో మరింత వేగం పెంచండి

#Chief Secretary of TS

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతో పాటు  కూలీలకు విధిగా పనులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు బీఆర్కే భవన్  నీటిపారుదల, పంచాయతీ రాజ్ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానం పై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ నేపథ్యంలో వచ్చే ముప్పై రోజుల లో కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బులు చేతికి అందుతాయని, తద్వారా గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. కాలువల నిర్మాణం, ఫీడర్ చానల్ పనులు ముమ్మరంగా చేపట్టాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యమంత్రి ఆశయాలు కు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనులు చేయాలని కోరారు.

Related posts

రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

Satyam NEWS

మునుగోడు కేసీఆర్ పార్టీ అభ్యర్ధిగా కూసుకుంట్ల

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థల మూసివేత

Satyam NEWS

Leave a Comment