33.7 C
Hyderabad
May 30, 2024 02: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న మద్యం

CM-YS-JAGAN

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం దశలు వారీగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా వచ్చే అక్టోబర్ ఒకటో తేది నుండి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే  రాష్ట్రంలో బెల్ట్ షాప్ లను కట్టడి చేసిన  ప్రభుత్వం మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రం లో 4500 మద్యం దుకాణాలు ఉండగా  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాలను సుమారు 3500కి కుదించింది. దుకాణాలను కుదించటంతో పాటు ఈ దుకాణాల నిర్వహణకు సుమారు 10000 ల నుంచి 15000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

సిబ్బంది నియామకానికి ప్రభుత్వ ఏర్పాట్లు

సేల్స్ సూపర్వైజర్  15000 రూపాయలు, సేల్స్ మెన్ కు 10000 ల రూపాయలు జీతాలు గా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 357 జిఓ ను జారీచేసింది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెబ్సైటు ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ దరఖాస్తు నమూనాను ఉంచింది. దీనితో పాటు మద్యం సరఫరా చేసే డిపోలు వద్ద కూడా మరికొంత మంది కి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాల ఫై నియంత్రణ లేకపోవడంతో గతంలో మద్యం దుకాణదారులు ఆడిందే ఆట పాడిందే పాట గా కొనసాగింది. దుకాణాల లైసెన్స్ పొందిన తరువాత అంతా రింగు గా ఏర్పడి ఒకే ధరకు అమ్మాలని నిర్ణయించేవారు. దీనివల్ల వాళ్లు నిర్ణయించిన ధరకే మద్యం కొనాల్సిన వచ్చేది. దీనితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ మద్యాన్ని తీసికొనివచ్చి చీప్ లిక్కర్ పేరుతొ విక్రయించేవారు.

ఇంత కాలం చీప్ లిక్కర్ తో జేబు గుల్ల

దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు జేబులు కు చిల్లులు పడేవి.రాష్ట్రంలోని నూతన ప్రభుత్వం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం విక్రయించాలని నిర్ణయించటంతో నకిలకు అడ్డుకట్ట వేయటంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యం వినియోగదారులకు లభిస్తుంది. దానితోపాటు సుమారు 1000 వరకు మద్యం దుకాణాలు రద్దు అవుతుండటం, బెల్ట్ దుకాణాలు బంద్ కావటంతో ఎక్కడపడితే అక్కడ మద్యం దొరికే పరిస్థితి  ఉండదు. మేజర్ పంచాయితీలు మండల కేంద్రాలు చిన్న చిన్న నగరాలు పట్టణాలకు మాత్రమే దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. దీనితో పాటు ఉదయం 10 గంటలనుంచి రాత్రి 10 గంటలు వరకు మాత్రమే దుకాణాలు అందుబాటులో ఉంటాయి. దీనితో ఎప్పుడు పడితే ఎక్కడైనా మద్యం లభించే అవకాశం కనిపించదు.

బెల్టు షాపుల రద్దుతో గ్రామీణ మహిళల ఆనందం

ఇప్పటికే బెల్ట్ దుకాణాలపై నియంత్రణ పెట్టడంతో గ్రామాలలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 500 జనాభా కలిగిన గ్రామంలో కూడా బెల్ట్ దుకాణాలు ఉండటంతో మద్యం ఏరులై పారేది. దీనితో గ్రామాలలో శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తేవి. అయితే కొన్ని గ్రామాలలో విద్యావంతులైన యువకులు గ్రామాలలో మద్యం అమ్మకాలను, వాడకాన్ని నిషేధిస్తున్నారు. ఉదాహరణకు విజయనగరం జిల్లా బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో చాలా రోజుల క్రితం గ్రామంలో అమ్మకాలను, వాడకాలను నిషేధించారు. ఈ మండలం ఈ గ్రామానికి తొలి నుంచి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలతో పాటు ఉన్నత పాఠశాల చాలా కాలం క్రితంనుంచి ఇక్కడ ఉన్నాయి. ఒకఅప్పుడు వర్గ రాజకీయాలకు కేంద్రం గా ఉండే ఈ గ్రామం  ప్రస్తుతం  ఆధ్యాత్మికతతో దేవాలయాల పునరుద్ధరణ, రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో ఉత్తమ గ్రామం గా అభివృద్ధి చెందుతోంది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోని మధ్య పాన నిషేదానికి ప్రజలు సహకరిస్తే ఐదు సంవత్సరాల్లో నక్షత్రాల హోటల్ కె మద్యం పరిమితం చేస్తానని ఎన్నికల హామీని ఇచ్చిన  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ఆ హామీ ని నిలబెట్టుకోవటం చాలా సులభతరం అవుతుంది.

ramakrishna-mutnuru-1
ముట్నూరు రామకృష్ణ

Related posts

మెరుగైన వైద్య సేవలు అందేలా అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

డ్రోన్ కెమెరాతో 9 మంది మందు బాబుల పట్టివేత

Satyam NEWS

కోవిడ్ పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment