40.2 C
Hyderabad
April 26, 2024 13: 30 PM
Slider ఆధ్యాత్మికం

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!

#khairatabadganesh

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది.

ఇందులో విగ్రహానికి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు త్రిశక్తి మహా సరస్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 50 అడుగుల ఎత్తుతో మట్టి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటుచేసేందుకు నిర్ణయించినట్లు ఉత్సవ కమిటీ ఇప్పటికే వెల్లడించింది.

గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts

కంటైన్ మెంట్ జోన్: ఈ ప్రజలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది?

Satyam NEWS

సంచలనాత్మక సంఘటనలు వెల్లడించనున్న ఎల్ వి సుబ్రహ్మణ్యం

Satyam NEWS

మద్యం దుకాణం లో మంటలు

Bhavani

Leave a Comment