40.2 C
Hyderabad
April 29, 2024 18: 28 PM
Slider మహబూబ్ నగర్

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి:కలెక్టర్ షేక్

#wanaparthycollector

ప్రభుత్వం 15 సం.ల నుండి 18 సంవత్సరముల వయస్సు కలిగిన వారు స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. 

సోమవారం వనపర్తిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం, అర్బన్ మహిళ డెవలప్మెంట్ సొసైటీ పిర్ల గుట్ట టీచర్స్ కాలనీ సెంటర్ లో 15 సం.ల నుండి 18 సంవత్సరముల వయస్సు కలిగిన వారికి స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 27 వేల ఐదు వందల మంది 15 నుండి 18 ఏళ్ల వయస్సు కలవారు ఉన్నారని, 7 వేల 8 వందల మంది అర్బన్, 19 వేల 7 వందల మంది రూరల్ లో వున్నారని, వారికి 7 రోజుల లోపు వ్యాక్సిన్ మొదటి డోసు వేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. 

జిల్లాలో 19 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించాలని, మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారు 28 నుండి 48 రోజుల లోపు రెండవ డోసు తీసుకొనుటకు అర్హులని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా వైద్యాధికారులు, పాఠశాల, కళాశాల నిర్వాహకులు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో డి హెచ్, సి హెచ్ సి, పి హెచ్ సి, యు హెచ్ సి, సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తారని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అనంతరం ప్రథమ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా  డి.పి.హెచ్.వో. రవిశంకర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామచంద్ర రావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మెడికల్ అధికారి డాక్టర్ బాలమణి, ఏఎన్ఎం లు చంద్రమ్మ, నిర్మల, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది

Satyam NEWS

ఆర్యవైశ్య పంచాంగకర్త డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త పంచాంగ ఆవిష్కరణ

Satyam NEWS

జీహెచ్ఎంసీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఏర్పాట్లు పూర్తి

Sub Editor

Leave a Comment