39.2 C
Hyderabad
April 28, 2024 14: 00 PM
Slider కృష్ణ

యస్సి, యస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

#karikalavelanias

రాష్ట్రంలోని ప్రతి దళితుడు పారిశ్రామిక వేత్తగా ఎదగాలని ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ కరికాల వళవన్ కోరారు. సోమవారం నాడు ఏపీ రాష్ట్ర సచివాలయం లోని తమ ఛాంబర్ నందు యస్సి,యస్టీలతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అనేక సంక్షేమ పధకాలు అమలు పరచడంతో పాటు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోడానికి యస్సి,యస్టీలకు అవకాశాలను కల్పించడానికి సిఎం పూర్తిగా దృష్టి పెట్టారని అందులో భాగంగానే జీవో నెంబర్ 7 జారీ చేశారన్నారు. గతంలో ఉన్న అన్నిరకాల అవకతవకలు రద్దు పరచి క్రొతగా వచ్చిన జీవోను ప్రతి ఒక్క దళితుడు ఉపయోగించుకొని ఫ్యాక్టరీలు కట్టడంతో పాటు మరికొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ శాతాన్ని నిర్ములించి రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం ఉందన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికులుగా ఎదగడానికి గత 11సంవత్సరాలనుండి పోరాటం సాగిస్తున్న,గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ నందు స్థలములకై పోరాడుతున్న నాయకులు నూతనంగా జీవో యం.యస్ నెంబర్ 7 విడుదలయ్యేందుకు కృషి చేసిన వళవన్ ను ప్రకాశం జిల్లా దళిత పారిశ్రామిక వేత్తల సంఘం నాయకులు తాటిపర్తి వెంకటస్వామి,ప్రసన్న రాజు,జి.శివాజీ,కె,పి,యస్, రత్నరాజు,జండ్రాజుపల్లి ఆంజనేయులు,బిరుదల రమేష్,రామారావు,బాబురావు, విజయశేఖర్, ఇండ్ల రఘుకుమార్,మేకల వెంకటేశ్వర్లు,భక్తవత్సలం ఆధ్వర్యంలో వళవన్ ను ఘనంగా సన్మానించారు.

Related posts

సైరా చిత్రం విడుదలను అడ్డుకోలేం

Satyam NEWS

అంబర్ పేట్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి

Bhavani

టెన్నిస్ కోర్టుల పనులు వారంలోగా పూర్తి

Murali Krishna

Leave a Comment