40.2 C
Hyderabad
April 29, 2024 17: 10 PM
Slider ఖమ్మం

సైన్స్ ఫెయిర్ లో ప్రతి విద్యార్థి పాల్గొనాలి

#bhadri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈనెల 24, 25, 26 తేదీలలో జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతి విద్యార్థి తప్పక పాల్గొనాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి సూచించారు.  జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ సమావేశంలో మాట్లాడుతూ పిల్లలలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించేలా ప్రదర్శన ఉండాలని, ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనకు జరిగే ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రదర్శన చూడటానికి చుట్టుపక్కల మండలాల నుండి విద్యార్థిని విద్యార్థులు వచ్చేటట్లుగా తగు ఏర్పాట్లు చేయాలని డిఇఓ కి సూచించారు. ఈ ప్రదర్శనలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు తప్పనిసరిగా ఈ ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొనేటట్లుగా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సోమశేఖర శర్మ, సెక్టోరియల్ అధికారులు నాగరాజు శేఖర్, సైదులు, సతీష్, జిల్లా సైన్స్ అధికారి చలపతి రాజు, జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్ రాజు, శ్రీదేవి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related posts

నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం

Murali Krishna

లాండ్రీ, కటింగ్ షాపులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

పాకిస్తాన్ కు నిలిచిపోయిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం

Satyam NEWS

Leave a Comment