40.2 C
Hyderabad
April 29, 2024 15: 55 PM
Slider నిజామాబాద్

కోవిడ్ 19 నిబంధనలు అందరూ పాటించాల్సిందే..

#Yellareddy Municipality

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్ననందున ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలో సోమవారం మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం అధికారులతో, వ్యాపార సముదాయాల వారితో  అత్యవసర సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చైర్మన్ కుడుముల సత్యం మాట్లాడుతూ ప్రజలు  కరోనా వైరస్ బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా  నివారణ చర్యలు చేపట్టాలని  నిర్ణయించామన్నారు.  ఎల్లారెడ్డి పురపాలక సంఘ పరిధిలోని అన్ని రకాల  వ్యాపార సముదాయాలు, దుకాణ సముదాయాల  యజమానుల సలహా మేరకు మంగళవారం నుంచి  ఉదయం 6 గంటల నుండి  మధ్యాహ్నం 2:00 రెండు గంటల వరకు షాపులన్ని తెరచి ఉంటాయని( వైన్స్ షాపులు తప్ప ) రెండు గంటల తర్వాత బంద్ చేయాలని కోరారు.

ప్రతి ఆదివారం సంత పూర్తిగా బందు చేయాలని కోరారు.  ఇతర గ్రామాల ప్రజలు ఆదివారం సంతకు రాకూడదని తెలిపారు. అంతేకాకుండా దుకాణదారులు ప్రతి దుకాణం ముందు శానిటైజర్ బాటిల్ ఉంచాలని, దుకాణాలకు వచ్చేవారు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా,  సామాజిక దూరం పాటించేలా చూసుకోవాలని సూచించారు. కరోన వ్యాప్తి తగ్గేవరకు ఈ నియమాలు పాటించాలని కోరారు.

కోవిడ్ 19  నిబంధనలు ఉల్లంఘించిన  దుకాణ యజమానులపై, ఇతరులపై  చట్టప్రకారం తగు చర్యలు  తీసుకుంటారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ ఖమర్  అహ్మద్,  పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్ ఐ  శ్వేత, కౌన్సిలర్లు జంగం నీలకంఠం, బుంగరి రాము, విద్యాసాగర్, పట్టణ వ్యాపార వాణిజ్య అధ్యక్షులు, యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు

Satyam NEWS

ఐ ఎన్ టి యు సి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా యరగాని నాగన్న

Satyam NEWS

సెల్ఫ్ క్యారంటైన్: జనతా కర్ఫ్యూ లో ఉన్న మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment